తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసా…గుతూనే ఉంది. కానీ ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మాత్రం వచ్చేశాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలత విజయం సాధించారు. తన విజయానికి కావాల్సిన 50శాతం ఓట్లు దాటడంతో కల్పలత గెలిచారు. 6153 ఓట్లు దాటగానే కల్పలత గెలిచినట్లు ప్రకటించారు. మొత్తం 19మంది పోటీచేయగా 12554 మంది ఓటేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి అయితే 6153 ఓట్లు రాలడంతో సగానికికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన కల్పలతను విజేతగా అధికారులు ప్రకటించారు.
Also Read: బ్రేకింగ్: తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
ఇక ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ ఘన విజయం సాధించారు. 1537 ఓట్ల మెజారిటీతో ఆయన ఆయన విజయం సాధించారు.
ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో రౌండ్ లో టీఆర్ఎష్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 3787 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పల్లాకు 15857, మల్లన్నకు 12070, కోదండరాంకు 9448, బీజేపీ ప్రేమేందర్ రెడ్డికి 6669, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయర్ కు 3244 ఓట్లు పోలయ్యాయి.
Also Read: తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. తీవ్ర ఉత్కంఠ!
మరోవైపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 17429 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి రాంచంద్రారావుకు 16385 ఓట్లు వచ్చాయి. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 8357 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 5101 ఓట్లువచ్చాయి. 44 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవీ కొనసాగుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్