ఏపీ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలు ఈ సమయంలో నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేసినా.. వినకుండా మొండిగా ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిన్న ఏకంగా రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం సంచలనమైంది. దీనిపై జగన్ సర్కార్ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.
Also Read: హిందూపురం వేదికగా బాలయ్య స్టేట్ పాలిటిక్స్
తాజాగా పంచాయితీ ఎన్నికల ప్రకటనపై జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హౌస్ మోహన్ పిటీషన్ దాఖలు చేసింది.దీనిపై సోమవారం విచారణ చేపట్టనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.
ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా ఉండడం.. కరోనా పరిస్థితులు.. టీకా షెడ్యూల్ వల్ల ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. అయితే ఉన్నతాధికారులు మొదట ఎస్ఈసీతో భేటి అయ్యి చర్చలు జరపాలని హైకోర్టు సూచించింది. ఈ ప్రకారం ఏపీ ఉన్నతాధికారులు నిమ్మగడ్డతో భేటి అయ్యి కరోనా వ్యాక్సినేషన్ దృష్ట్యా ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఎన్నికలను మరికొన్నాళ్లు వాయిదా వేయాలని అధికారుల బృందం ఎస్ఈసీని కోరింది.
Also Read: తిరుపతి బైపోల్‌లో గ్లామర్ షో
అయితే నిమ్మగడ్డ ఈ అధికారుల మాటను లెక్కచేయకుండా ఏకంగా కొన్ని గంటల్లోనే నాలుగుదశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ఒక ప్రకటన విడుదల చేశారు. తాజాగా ఈ ప్రకటనను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది.
ఇప్పుడు పంచాయితీ ఎన్నికల బంతి హైకోర్టు చేతిలో ఉంది. కోర్టు ఆదేశించినా సీఎం జగన్ నిర్వహించే పరిస్థితుల్లో లేరు. సుప్రీంకోర్టుకు ఎక్కే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మగడ్డ ఆధ్వర్యంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు జగన్ సర్కార్ సిద్ధంగా లేదనే చెప్పొచ్చు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్