
టాలీవుడ్లో అపజయాల్లేకుండా దూసుకెళుతున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. అనిల్ ఇప్పటివరకు కేవలం ఐదు సినిమాలు చేసేనప్పటికీ అగ్ర దర్శకుడిగా మారిపోయాడు. ‘పటాస్’ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
Also Read: మహేష్ తో అనిల్ రావిపూడి వన్స్ మోర్..!
ఈ మూవీ తర్వాత దిల్ రాజు బ్యానర్లో వరుసగా మూడు సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సుప్రీమ్’.. ‘రాజా ది గ్రేట్’.. ‘ఎఫ్-2’ మూవీలు మంచి విజయాలు సాధించింది. దీంతో వీరిద్దరిది సక్సస్ ఫుల్ కాంబినేషన్ గా నిలిచిపోయింది. తాజాగా ఎఫ్-2కు సిక్వెల్ గా ఎఫ్-3 రాబోతుంది.
ఎఫ్-2 మూవీ దిల్ రాజు-అనిల్ రావిపూడిలకు మంచి విజయం అందించడంతోపాటు అవార్డులను కూడా తీసుకొచ్చాయి. ఎఫ్-2 మూవీ ఇండియన్ పనోరమాకి సెలెక్ట్ అయి జాతీయ అవార్డును దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరునీకెవ్వరు’ మూవీని తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్టందుకున్నాడు.
Also Read: టాలీవుడ్ ను మళ్లీ దువ్వుతున్న కేసీఆర్!
‘సరిలేరునీకెవ్వరు’ మూవీ అనిల్ రావిపూడితోపాటు మహేష్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. దీంతో మహేష్-అనిల్ కాంబోలో మరో సినిమా రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా అనిల్ రావిపూడి ఎఫ్-3 సిక్వెల్ తోపాటు నాగచైతన్యతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
అనిల్ రావిపూడి సినిమాలన్నీ ఫ్యామిలీతో కూర్చొని చూసే తరహాలోనే ఉంటాయి. పాతతరం దర్శకుడు జంధ్యాల తరహా ఫ్యామిలీ.. కామెడీ తరహా మార్క్ అనిల్ సినిమాల్లో కన్పిస్తూ ఉంటుంది. ఫ్యామిలీ తరహా సినిమాలతో వరుస విజయాలు సాధిస్తున్న అనిల్ రావిపూడి మరిన్ని విజయాలు సాధించాలని ‘ఒకే తెలుగు’ టీం కోరుకుంటుంది. వన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే అనిల్ రావిపూడి.