
మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ఢీ సినిమా విజయవంతం అయిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్ గా మరో సినిమా తీస్తున్నట్లు విష్ణు ఇటీవల ప్రకటించాడు. ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగోను సోమవారం విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో పెట్టాడు. గత కొంతకాలంగా వీరిద్దరి సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కాంబినేషన్లో సినిమా తీసి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఢీ సినిమాలో హీరోయిన్ గా జెనిలియా నటించింది. శ్రీహరి ప్రధాన పాత్రలో నటించారు. కామెడీ ప్రధానంగా వచ్చినా ఆ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. మరి శ్రీను వైట్ల ఇప్పడు ఏ విధంగా కామెడి పండించబోతున్నాడో చూడాలి..
Here we go again! But this time it’s D&D Double Dose. Very excited to partner with my big brother Sreenu Vaitla garu again. God speed! #DD #Doubledose pic.twitter.com/TLeCZAq4kd
— Vishnu Manchu (@iVishnuManchu) November 23, 2020