https://oktelugu.com/

డబ్బులు ఎక్కువ ఇస్తేనే ఉంటుందట !

‘జబర్దస్త్’ అనే టీవీ షోకు గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ఒక్క యూత్ లోనే కాకుండా, సిటీల్లో అలాగే చదువుకున్న వాళ్లల్లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ఈ షో మొదలై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా సక్సెస్ ఫుల్ గానే నడుస్తుండటం నిజంగా బుల్లితెర చరిత్రలోనే ఒక చెదిరిపోని రికార్డ్ ఇది. ఇప్పటికీ కొన్ని స్కిట్స్ విపరీతమైన ప్రజారాధన పొందుతున్నాయి అంటే.. ఈ షో ఎంతలా జనం గుండెల్లోకి చేరువైందో అర్ధం చేసుకోవచ్చు. అయినా కంటెంట్ కొంచెం […]

Written By:
  • admin
  • , Updated On : April 9, 2021 / 05:03 PM IST
    Follow us on


    ‘జబర్దస్త్’ అనే టీవీ షోకు గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ఒక్క యూత్ లోనే కాకుండా, సిటీల్లో అలాగే చదువుకున్న వాళ్లల్లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ఈ షో మొదలై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా సక్సెస్ ఫుల్ గానే నడుస్తుండటం నిజంగా బుల్లితెర చరిత్రలోనే ఒక చెదిరిపోని రికార్డ్ ఇది. ఇప్పటికీ కొన్ని స్కిట్స్ విపరీతమైన ప్రజారాధన పొందుతున్నాయి అంటే.. ఈ షో ఎంతలా జనం గుండెల్లోకి చేరువైందో అర్ధం చేసుకోవచ్చు. అయినా కంటెంట్ కొంచెం బాగున్నా.. తెలుగు ప్రేక్షుకులు నెత్తిన పెట్టుకుంటారు.

    దీనికి ఉదాహరణగా అంటే.. ఈ షోకి వచ్చే రికార్డ్ స్థాయి రేటింగ్సే రుజువు. కాగా గ్లామర్ యాంకర్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ‘రష్మీ గౌతమ్’ జబర్దస్త్ టీవీ షో ద్వారానే వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు ఇండస్ట్రీలో దాదాపు ఏడేళ్ల పాటు అవకాశాల కోసం తిరిగినా, అప్పుడు ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒకటి రెండు సినిమాల్లో కాస్త గుర్తుపట్టే పాత్రలు చేసినా, వాటి వల్ల మాత్రం ఆమెకు ఎలాంటి ఉపయోగం లేదు.

    అలాంటి గడ్డు పరిస్థితుల్లో జబర్దస్త్ టీవీ షోకి వచ్చి తనకంటూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ షో వెనుక ఆ మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి, దాంతో ఈ షో దర్శకులు భరత్, నితిన్ లతో పాటు జడ్జ్ నాగబాబు కూడా బయటికి వెళ్లిపోయారు. అయితే తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ కూడా జబర్దస్త్ షో నుండి బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె జీ తెలుగు వారితో పాటు మా టీవీ వారితో కూడా రెండు షోలకు కమిట్ అయిందట.

    కాకపోతే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేముందు మల్లెమాల సంస్థవారితో ఒకసారి కలిసి మాట్లాడిందట. తానూ యాంకర్ గా జాయిన్ అయి ఐదేళ్లు అవుతున్నా.. రెమ్యునరేషన్ ను మాత్రం కేవలం మూడుసార్లు మాత్రమే పెంచారు అని, దయచేసి రెమ్యునరేషన్ ను పెంచగలిగితే.. ఎప్పటికి జబర్దస్త్ లోనే ఉంటాను అని చెప్పిందట. మరి ఆమెకు డబ్బులు ఎక్కువ ఇస్తే జబర్దస్త్ లోనే ఉంటుంది, లేదు అంటే మారిపోతుంది అన్నమాట.