https://oktelugu.com/

పాలిటిక్స్ లోకి అల్లు అర్జున్.. టాలీవుడ్లో చర్చ..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురములో’ మూవీ ఈ సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ హిట్టందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అటూ అల్లు అర్జున్ కెరీర్లోనూ.. ఇటూ త్రివిక్రమ్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ‘అలవైకుంఠపురములో’ సినిమా తర్వాత అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. Also Read: బాలయ్యకి విలన్ కాదు, యంగ్ హీరో కావాలట ! అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో ఇప్పటికే ఆర్య.. ఆర్య-2 వంటి చిత్రాలు తెరకెక్కి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2020 / 05:52 PM IST
    Follow us on

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురములో’ మూవీ ఈ సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ హిట్టందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అటూ అల్లు అర్జున్ కెరీర్లోనూ.. ఇటూ త్రివిక్రమ్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ‘అలవైకుంఠపురములో’ సినిమా తర్వాత అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’.

    Also Read: బాలయ్యకి విలన్ కాదు, యంగ్ హీరో కావాలట !

    అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో ఇప్పటికే ఆర్య.. ఆర్య-2 వంటి చిత్రాలు తెరకెక్కి మంచి విజయాలు సాధించాయి. వీరద్దరికి హట్రిక్ కాంబినేషన్ గా ‘పుష్ప మూవీ రాబోతుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    కరోనాతో ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. రాజమండ్రిలో జరుగుతున్న ఈ మూవీ షూటింగులో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ దర్శకుడు కొరటాలతో శివ ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు విన్పించాయి. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ రెండు ఇంట్రెస్టింగ్ పాత్రల్లో కన్పించబోతున్నాడని సమాచారం.

    Also Read: మళ్ళీ తల్లి కావాలని ఉంది – అనసూయ

    అల్లు అర్జున్-కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే మూవీలో అల్లు అర్జున్ ఫస్ట్ హాఫ్ లో స్టూడెంట్ లీడర్ గా.. సెకండ్ హాఫ్ లో పవర్ ఫుల్ పొలిటిషన్ గా కన్పించబోతున్నాడట. టైటిల్ కూడా ఖరారుకానీ ఈ సినిమాను దర్శకుడు కొరటాల పొలిటిక్ డ్రామాగా తెరకెక్కించబోతున్నాడట. ఇందులో నిజమెంతుందోగానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ పట్ల ఖుషీ అవుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్