గూగుల్ పే యూజర్లకు అలర్ట్.. యాప్ తొలగింపు..?

భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు వినియోగించే యాప్ లలో గూగుల్ పే ఒకటి. డిజిటల్ లావాదేవీల కోసం ఎక్కువగా ఉపయోగించే ఈ యాప్ ను యాపిల్ స్టోర్ నుంచి తొలగించారు. యాపిల్ ఇండియన్ యూజర్లకు తాత్కాలికంగా ఈ యాప్ అందుబాటులో ఉండదు. యాపిల్ ఫోన్లు వాడే వాళ్లు ఈ యాప్ కోసం వెతికితే ఇతర యాప్స్ కనిపిస్తాయి తప్ప గూగుల్ పే యాప్ కనిపించదు. యాపిల్ స్టోర్ నుంచి గూగుల్ పేను తొలగించడానికి ముఖ్యమైన కారణం ఉంది. […]

Written By: Navya, Updated On : October 26, 2020 7:16 pm
Follow us on


భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు వినియోగించే యాప్ లలో గూగుల్ పే ఒకటి. డిజిటల్ లావాదేవీల కోసం ఎక్కువగా ఉపయోగించే ఈ యాప్ ను యాపిల్ స్టోర్ నుంచి తొలగించారు. యాపిల్ ఇండియన్ యూజర్లకు తాత్కాలికంగా ఈ యాప్ అందుబాటులో ఉండదు. యాపిల్ ఫోన్లు వాడే వాళ్లు ఈ యాప్ కోసం వెతికితే ఇతర యాప్స్ కనిపిస్తాయి తప్ప గూగుల్ పే యాప్ కనిపించదు. యాపిల్ స్టోర్ నుంచి గూగుల్ పేను తొలగించడానికి ముఖ్యమైన కారణం ఉంది.

యాపిల్ ఫోన్లలో గూగుల్ పే యాప్ వినియోగించే వినియోగదారులు ఆగష్టు నెలలో డిజిటల్ లావాదేవీలు చేసే సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో యాపిల్ ఫోన్లు వాడే చాలామంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో గూగుల్ పే సిబ్బంది సమస్యను పరిష్కరించారు. అయితే పూర్తిస్థాయిలో ఆ సమస్య పునరావృతం కాకుండా ఉండేదుందుకు యాపిల్ స్టోర్ నుంచి యాప్ ను తొలగించారు.

అయితే గూగుల్ పే యాప్ యాపిల్ స్టోర్ లో అందుబాటులో లేకపోయినా ఆండ్రాయిడ్ వెర్షన్ లో మాత్రం గతంలోలా అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ లో యాప్ వినియోగించే వాళ్లకు ఎటువంటి సమస్య లేదని పేర్కొంది. పేమెంట్ ఫెయిల్ సమస్య కొంతమంది యాపిల్ ఫోన్ యూజర్లకు ఎదురు కావడంతో పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరించి మళ్లీ యాప్ ను అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.

ఏదైనా సహాయం కావాలనుకుంటే గూగుల్ పే కస్టమర్లు కస్టమర్ కేర్ నంబర్ ను సంప్రదించి సహాయం పొందవచ్చు. వీలైనంత త్వరగా యాప్ ను అందుబాటులో తెస్తామని గూగుల్ పే ప్రతినిధులు చెబుతున్నారు. యాపిల్ యూజర్లు గూగుల్ పేను డౌన్ లోడ్ చేసుకోవాలంటే కొన్నిరోజులు ఎదురుచూపులు తప్పవు.