https://oktelugu.com/

కరోనా కొత్త స్ట్రెయిన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

కరోనా వైరస్.. కరోనా కొత్త స్ట్రెయిన్లు ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని సంబరపడేలోపే కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ కొత్త స్ట్రెయిన్ పై పని చేస్తుందా? లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతోన్నాయి. Also Read: నేటితో ఈయూకు గుడ్ బై చెప్పబోతున్న బ్రిటన్..! బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు అధికంగా నమోదవుతుండటంతో అన్నిదేశాలు అప్రమత్తం అవుతున్నాయి. భారత్ సైతం కరోనా కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 31, 2020 / 12:33 PM IST
    Follow us on

    కరోనా వైరస్.. కరోనా కొత్త స్ట్రెయిన్లు ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని సంబరపడేలోపే కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ కొత్త స్ట్రెయిన్ పై పని చేస్తుందా? లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతోన్నాయి.

    Also Read: నేటితో ఈయూకు గుడ్ బై చెప్పబోతున్న బ్రిటన్..!

    బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు అధికంగా నమోదవుతుండటంతో అన్నిదేశాలు అప్రమత్తం అవుతున్నాయి. భారత్ సైతం కరోనా కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

    కరోనా కొత్త స్ట్రెయిన్ 70శాతం అధికంగా విజృంభిస్తుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. భారత్ లోనూ నిన్నటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. కరోనా కొత్త స్ట్రెయిన్ పై తాజాగా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు.

    సెప్టెంబర్లోనే కరోనా కొత్త స్ట్రెయిన్ రూపాంతరం చెందుతూ వచ్చిందని వచ్చిందని తెలిపారు. కరోనా కొత్త స్ట్రెయిన్ ఇండియాకు నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలోనే వచ్చి ఉండొచ్చని రణదీప్ గులేరియా తెలిపారు.

    Also Read: షాకింగ్: దేశ ప్రధానిపై బాంబు దాడి.. 26మంది మృతి

    డిసెంబర్లో బ్రిటన్ కొత్త స్ట్రెయిన్ గురించి ప్రకటించక ముందే హాలెండ్ లో కొత్త స్ట్రెయిన్ కేసు నమోదైనట్టు రణదీప్ గులేరియా గుర్తుచేశారు. దీనిని బట్టి చూస్తే దేశంలోకి నవంబర్లోనే కొత్త స్ట్రెయిన్ వచ్చి ఉండొచ్చని అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

    బ్రిటన్.. దక్షిణాఫిక్రా.. హలెండ్.. భారత్ తోపాటు పలు దేశాల్లో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కరోనా నిబంధనలను ప్రతీఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు