https://oktelugu.com/

రవితేజ రీల్ కూతురు ఇప్పుడు హీరోయిన్ లా ఉందిగా !

నేషనల్ సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి తన సినీ కెరీర్ లో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లను పరిచయం చేశాడు. వారిలో కొంతమంది హీరోలు అయిన వాళ్లు ఉన్నారు. కానీ, ఇంతవరకూ ఎవ్వరూ హీరోయిన్ అవ్వలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికి రెడీ అయిపోయింది నేహా. ఇంతకీ ఎవరూ ఈ నేహా. మాస్ మహారాజ రవితేజ – జక్కన కాంబినేషన్ లో వచ్చిన సెన్సషనల్ బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు సినిమాలో రవితేజకి కూతురుగా నటించిన పాపే నేహా. ఆ […]

Written By:
  • admin
  • , Updated On : December 31, 2020 / 12:36 PM IST
    Follow us on


    నేషనల్ సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి తన సినీ కెరీర్ లో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లను పరిచయం చేశాడు. వారిలో కొంతమంది హీరోలు అయిన వాళ్లు ఉన్నారు. కానీ, ఇంతవరకూ ఎవ్వరూ హీరోయిన్ అవ్వలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికి రెడీ అయిపోయింది నేహా. ఇంతకీ ఎవరూ ఈ నేహా. మాస్ మహారాజ రవితేజ – జక్కన కాంబినేషన్ లో వచ్చిన సెన్సషనల్ బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు సినిమాలో రవితేజకి కూతురుగా నటించిన పాపే నేహా. ఆ సినిమాలో చిన్న పాపగా నేహా నటించిన ఎమోషనల్ నటనను అంత తేలికగా ఎవ్వరు మర్చిపోగలరు.

    Also Read: మహేష్ కుమార్తె నుండి విలువైన మెసేజ్ !

    ఆ సినిమాలో అమాయకంగా ఎంతో క్యూట్ గా నటించిన నేహా, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్షా సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టింది కూడా. ముఖ్యంగా శాడ్ క్యారెక్టర్స్ లో నేహా నటన అద్భుతంగా ఉంటుంది. నిండా 5 ఏళ్ళు కూడా నిండని వయస్సులో నేహా నటనకు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అందరూ ఆశ్చర్యపోయారంటే.. అతిశయోక్తి కాదు. అలాంటి నటి కాబట్టే.. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా.. ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. నిజానికి ఆమెకి బాలనటిగా ఎన్నో ఆఫర్లు వరుసగా క్యూ కట్టాయి.

    Also Read: 2020 మూవీ రౌండప్.. కరోనా అల్లకల్లోలంలో హీరోలు !

    అయితే, అప్పుడు ఆమె తల్లి తండ్రులు నేహా విద్యాబ్యాసంని దృష్టిలో పెట్టుకొని ఆమెను సినిమాలకు దూరం చేశారు. అయితే ఆమెకు ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు వస్తోన్నా.. సినిమాలు మానేసి, ఇప్పుడు ప్లోరిడాలో ఆమె బిజినెస్ మానేజ్మెంట్ లో ఏంబీఏ చేస్తోందట. ఇక చదువు పూర్తి అయ్యాక తప్పకుండ మళ్ళీ సినిమాల్లో నటిస్తానని చెబుతోంది. ఏమైనా మూడేళ్ళ వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, తొలిమూవీ తోనే తానేమిటో నిరూపించుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ నేహా తోట.. మళ్లీ సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. ఇక నేహా తోట లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీ కోసం.