
అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు జర్మనీ షాకిచ్చింది. అప్గన్ కు డెవలప్ మెంట్ సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు జర్మన్ డెవలప్ మెంట్ మంత్రి గెర్డ్ ముల్లర్ రినిష్ స్థానిక మీడియాకు వివరించారు. దేశానికి అభివృద్ధి సహకారాన్ని ప్రస్తుతానికి నిలిపివేశామని అన్నారు. అలాగే అక్కడి నుంచి వచ్చేయాలని భావిస్తున్న స్థానిక అభివృద్ధి అధికారులు, ఎన్జీవోలకు చెందిన సభ్యులను దేశానికి రప్పించే పని కొనసాగుతుందన్నారు.