
దేశంలోనే అద్భుత ప్రాజెక్ట్ గా అందరి కీర్తినందుకుంటున్న ‘ఆదిపురుష్’ సినిమా నుంచి మరో అప్డేట్ అందింది. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ 3డీ చిత్రంలో ఇంకా ప్రధాన తారాగణం ఏంటనేది తెలియరాలేదు.
ముంబైలో ఇటీవల దర్శకుడు ఓంరౌత్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కొన్ని వరుస ఘటనల తర్వాత అనంతరం షూటింగ్ నిరాటకంగా కొనసాగుతోంది.
Also Read: ఓన్లీ ప్రభాస్ కే పరిమితం అవుతుందా ?
ఈ చిత్రం కథాంశం ప్రకారం.. ఎక్కువగా స్టూడియోలోనే చిత్రీకరిస్తున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన వీఎఫ్ఎక్స్ సాంకేతిక నిపుణులతో దర్శక నిర్మాతలు మాట్లాడుతున్నారని తెలిసింది. అవతార-స్టార్ వార్స్ వంటి భారీ చిత్రాలకు పనిచేసిన టెక్నికల్ టీంను ఈ చిత్రం కోసం ఒప్పిస్తున్నారట..
ఈ క్రమంలో ప్రభాస్ పక్కన సీతను , లక్ష్మణుడిని దర్శకుడు ఓంరౌత్ ఎంపిక చేశాడు. ఇప్పటిదాకా అనుష్కశర్మ, అనుష్క శెట్టి, కీర్తి సురేష్, కియార అద్వానీ తదితర భామల పేర్లు వినిపించాయి. కానీ తాజాగా సీతగా కృతి సనన్ ఎంపికైంది. ఇక లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ఎంపిక పూర్తయ్యింది. వారిద్దరినీ ఆదిపురుష్ దర్శకుడు ఔంరౌత్ సాదరంగా ఆహ్వానించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఆ ఫొటోలను ప్రభాస్ , దర్శకుడు ఔంరౌత్ పంచుకోవడంతో ఆదిపురుష్ లో సీత, లక్ష్మణుడు ఎవరో తెలిసిపోయింది.