
టాలీవుడ్ ఇండస్ట్రీలో అలనాటి నటుల్లో మురళీమోహన్ కు ప్రత్యేక స్థానం ఉంది. గ్లామర్ బాయ్ గా ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ కొందరు టీవీల్లో వస్తే చూసేవారున్నారు. అయితే హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందకు పైగా సినిమాలు చేసిన మురళీ మోహన్ ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం వయసు మీద పడడంతో రాజకీయాల్లోనూ యాక్టివ్ లేక తన కూతురును రంగంలోకి దింపారు. అయితే ఇటీవల ఆయన ఓ విషయం చెబుతూ పిచ్చినా కొ..కా.. అంటూ తిట్టుకున్నారు. ఆయన అలా అనడానికి కారణం ఇదేనా..?
జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్ తో పాటు నటుడిగా ఆకట్టుకున్న మురళీ మోహన్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక వ్యక్తిగా నిలుస్తారు. సినిమాల తరువాత టీడీపీలో చేరి ఎంపీగా పనిచేశారు. అటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ రాణించి భారీగా డబ్బు సంపాదించాడు. అయితే ఆయన ఎంపీగా పనిచేసిన రోజుల్లో కొందరు అనేక ఆరోపణలు చేశారు. ఆయన ఎంపీగా అధికారంలో ఉండి అక్రమంగా ఇసుక అమ్ముతూ కోట్లు సంపాదించారని ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో విడుదలై వైరల్ గా మారింది. ఇందులో మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజమండ్రి ఎంపీగా ఉన్న రోజుల్లో కొందరు గోదావరిలోని ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారని ప్రతిపక్షం వాళ్లు ఆరోపించారన్నారు. అయితే ‘ఒరేయ్ పిచ్చి నా కొడుకా..’మా ఇల్లు కట్టుకోవడానికి బయట మార్కెట్లో ఇసుక కొనుక్కున్నానని‘ చెప్పినట్లు మురళీ మోహన్ చెప్పారు. అయితే ఈ ప్రోమోలో ఈ విషయం వైరల్ అవుతోంది. పూర్తి వీడియో ఎలా ఉంటుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక తనకు రాజకీయాలంటూ అస్సలు ఇష్టం ఉండదని, అయితే చంద్రబాబు కన్వెన్సీ చేసి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని అన్నారు. అందుకే 2019 ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. రాజకీయాలంటే విరక్తి అన్నట్లు మురళీ మోహన్ కామెంట్స్ చేశారు.