https://oktelugu.com/

సీమ టపాకాయ్.. నటనలో జేపీ విలక్షణ

‘‘పెళ్ళినాడు గుడక మాంసం ఏదిరా.. ఒక్క దినము గుడక ఉండలేవా?’’ ‘‘వచ్చేదానికంటే పోయేదే ఎక్కువ ఉందేమి రా..’’ ‘‘మీ మనసులు దెల్చుకున్న్యాం. మా అలవాట్లని మార్చుకున్న్యాం..’’ ‘‘ఏమీ రా నోరు లెచ్చండాదే…’’ ‘‘ఒరేయ్‌ పులీ.. ఏమీరా నెత్తిన అట్ల గుడ్డ జుట్టుకున్న్యావ్‌.. బోడెమ్మ లెక్క…’’ ‘‘సీమ సందుల్లోకి రారా చూసుకుందాం.. నీ పతాపమో.. నా పతాపమో…’’ ‘‘యాందిరా యాంజేస్తన్రా..’’ ‘‘కూజా చెంబైంది..’’ క్యారెక్టర్‌‌ ఆర్టిస్ట్‌ జయప్రకాశ్‌ రెడ్డి ఫేమస్‌ డైలాగ్స్ ఇవి కొన్ని మాత్రమే. ఇవే కాదండోయ్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2020 / 10:52 AM IST
    Follow us on

    ‘‘పెళ్ళినాడు గుడక మాంసం ఏదిరా.. ఒక్క దినము గుడక ఉండలేవా?’’
    ‘‘వచ్చేదానికంటే పోయేదే ఎక్కువ ఉందేమి రా..’’
    ‘‘మీ మనసులు దెల్చుకున్న్యాం. మా అలవాట్లని మార్చుకున్న్యాం..’’
    ‘‘ఏమీ రా నోరు లెచ్చండాదే…’’
    ‘‘ఒరేయ్‌ పులీ.. ఏమీరా నెత్తిన అట్ల గుడ్డ జుట్టుకున్న్యావ్‌.. బోడెమ్మ లెక్క…’’
    ‘‘సీమ సందుల్లోకి రారా చూసుకుందాం.. నీ పతాపమో.. నా పతాపమో…’’
    ‘‘యాందిరా యాంజేస్తన్రా..’’
    ‘‘కూజా చెంబైంది..’’

    క్యారెక్టర్‌‌ ఆర్టిస్ట్‌ జయప్రకాశ్‌ రెడ్డి ఫేమస్‌ డైలాగ్స్ ఇవి కొన్ని మాత్రమే. ఇవే కాదండోయ్‌ ఇక చాలానే ఉన్నాయి. బుర్ర మీసాలు.. పంచెకట్టుతో రాయలసీమ స్టైల్‌లో డైలాగ్స్‌ చెప్పడంలో జేపీ తరువాతే ఎవరైనా. ఆయన నటించిన చివరి సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇందులో విలన్ ప్రకాశ్ రాజ్ తండ్రిగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించారు. విలనిజంతో పాటు హాస్యాన్ని కూడా పండించారు. ఎవడిగోల వాడిది, సీమ టపాకాయ్, నమో వెంకటేశ, రెఢీ వంటి సినిమాల్లో విలనిజంతో పాటు తన దైన శైలిలో హాస్యాన్ని పండించారు.

    Also Read: ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

    ఆయన ఎన్ని సినిమాలు చేసినా.. ఆయన కెరీర్‌‌ను మార్చిన సినిమా ‘ప్రేమించుకుందాం రా’నే. అప్పటికే సినిమా ప్రయత్నాలు చేసి.. చిన్నచిన్న పాత్రలతో సరైన గుర్తింపు రాక విసిగిపోయిన ఆయన ఒకానొక సందర్భంలో ఇంటిబాట పట్టారట. ఆయనే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.అనూహ్యంగా సురేశ్‌ ప్రొడక్షన్‌ నుంచి ‘ప్రేమించుకుందాం రా’ సినిమా కోసం పిలుపురావడంతో తన కెరీర్ మలుపుతిరిగిందని అంటుంటారు. ఈ సినిమాకు ముందు ‘చిత్రం భళారే విచిత్రం’, ‘జంబలకిడిపంబ’ వంటి సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపించినా ఆయనకు పెద్దగా బ్రేక్‌ దొరకలేదు.

    రాయలసీమ మాండలికం జేపీకి పెద్ద ఎస్సెట్‌ అని చెప్పాలి. వాస్తవానికి ఈ సినిమా కూడా అనంతపురం జిల్లాలోనే చేశారు. ఇక ఈ సినిమాతో ఆయన ఇండస్ర్టీలో వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. ఫ్యాక్షన్‌ సినిమాలకు తప్పనిసరిగా విలన్‌ క్యారెక్టర్‌‌ కావాలంటే అది జేపీనే అని డైరెక్టర్లు కూడా ఫిక్స్‌ అయ్యారు. ఫ్యాక్షన్‌ సినిమాల్లో జేపీ సీరియస్‌నెస్‌తో కనిపిస్తే.. ఇక శ్రీనువైట్ల, వినాయక్‌ సినిమాలు ఆయనలోని హాస్యాన్ని కూడా వెలుగు తీశాయి. ‘ఢీ’ సినిమాలోని జేపీ పాత్ర ఇప్పటికీ ఎవరూ మరిచిపోరు. ‘కృష్ణ’ సినిమాలోనూ అటు ఫ్యాక్షన్‌ ఇటు కామెడీతో అదరగొట్టారు.

    అటు పెద్ద సినిమాలు చేస్తూనే.. ఇటు చిన్న సినిమాలకూ సమప్రాధాన్యం ఇస్తుండేవారు. సాధారణ సీన్‌ను కూడా తన యాస, ఎక్స్‌ ప్రెషన్స్‌తో జయప్రకాశ్‌ రెడ్డి తగిన న్యాయం చేస్తారని ఇండస్ట్రీలో టాక్‌. అందుకే ఆయన 20 ఏళ్లలో వెనుకబడిన సందర్బాలు లేవనే చెప్పాలి. ఎంత స్టార్‌‌ హీరో అయినా.. ఎంతటి పేరున్న హీరోయిన్‌ అయినా.. పేరుమోసిన విలనిజం అయినా.. ఎవరికైనా సినీ ఇండస్ర్టీలో ఎత్తుపల్లాలు ఉంటాయి. కానీ.. ‘ప్రేమించుకుందాం రా’ సినిమా తర్వాత ఆయనకే డిమాండ్‌ పెరిగింది.

    Also Read: రిటైర్ మెంట్ తీసుకున్న జేపీ ఎందుకు వెనక్కొచ్చాడు?

    తెలుగుతోపాటు పక్క భాషల్లోనూ జేపీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. త‌మిళంలో ప‌లు సినిమాల్లో న‌టించారు. ‘ఆరు’ సినిమాలో చెన్నైలోని తెలుగు విల‌న్ పాత్రలో జేపీ తెలుగులోనే మాట్లాడగా.. ఇక ఉత్తరాది మీమ్స్ పేజ్ వాళ్లు అయితే జేపీ ఫొటోను వాడుకుంటుంటారు! తెలుగు నుంచి హిందీలోకి అనువాదం అయిన యాక్షన్ సినిమాల‌తో జేపీకి అక్కడ గుర్తింపు ద‌క్కింది. సౌత్ సినిమాల్లో హోం మినిస్టర్‌‌ పాత్రలో కనిపించే నటుడు అంటూ మీమ్స్ పేజ్ వాళ్లు జేపీ ఫొటోను వాడుతుంటారు. జేపీకి సినిమాలతో పాటే నాటకరంగం అంటే కూడా చాలా ఇష్టమట.

    ఖాళీ స‌మ‌యాల్లో ఆయ‌న నాట‌కాన్ని కూడా వ‌ద‌ల్లేదట. త‌ను, త‌న స్నేహితుడొక‌రు రాసుకున్న ‘అలెగ్జాండ‌ర్’ నాట‌కాన్ని చిన్న చిన్న టౌన్లకు వెళ్లి ప్రదర్శించారట. అది ఏక‌పాత్రాభిన‌యం. దాన్ని సినిమాగా తెర‌కెక్కించాల‌నేది జేపీ చిర‌కాల ఆకాంక్ష. ఈ మ‌ధ్యనే దాన్ని సినిమాగా తీశార‌ని తెలుస్తోంది. చివ‌ర‌గా జేపీ అల‌రించిన సినిమా ‘స‌రిలేరు నీకెవ్వరూ’లో ‘కూజా చెంబైంది..’ అంటూ గుర్తుండిపోయే పాత్రలో క‌నిపించారు. ఇప్పుడు ఆయన మన నుంచి దూరమైనా తన కటౌట్‌, తన డైలాగులు మాత్రం నిత్యం అభిమానుల్లో ఉండిపోతాయని చెప్పొచ్చు.