రిటైర్ మెంట్ తీసుకున్న జేపీ ఎందుకు వెనక్కొచ్చాడు?

20 ఏండ్లకు పైగా ఇండస్ట్రీలో నటుడిగా సత్తాచాటారు.  తన రాయలసీమ యాస.. తన కామెడీ డైలాగ్స్‌.. తన యాక్టింగ్‌కు ఏ డైరెక్టర్‌‌ అయినా ఫిదా కావాల్సిందే. అలాంటి జయప్రకాశ్‌ రెడ్డి సడన్‌గా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నారు. గతేడాదే గుంటూరు‌ వెళ్లిపోయారు. తన కెరీర్‌‌ మంచి ట్రాక్‌లో ఉండగానే జేపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీ లో కూడా ఎవరికీ తెలియదు. ఆల్రెడీ ఒప్పుకున్న ఓ చిన్న సినిమా కంప్లీట్‌ చేసుకొని ఆయన […]

Written By: NARESH, Updated On : September 8, 2020 12:30 pm
Follow us on

20 ఏండ్లకు పైగా ఇండస్ట్రీలో నటుడిగా సత్తాచాటారు.  తన రాయలసీమ యాస.. తన కామెడీ డైలాగ్స్‌.. తన యాక్టింగ్‌కు ఏ డైరెక్టర్‌‌ అయినా ఫిదా కావాల్సిందే. అలాంటి జయప్రకాశ్‌ రెడ్డి సడన్‌గా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నారు. గతేడాదే గుంటూరు‌ వెళ్లిపోయారు. తన కెరీర్‌‌ మంచి ట్రాక్‌లో ఉండగానే జేపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీ లో కూడా ఎవరికీ తెలియదు. ఆల్రెడీ ఒప్పుకున్న ఓ చిన్న సినిమా కంప్లీట్‌ చేసుకొని ఆయన తన పిల్లల దగ్గరికి వెళ్లిపోయారు.

Also Read: ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

జేపీ టాలీవుడ్‌కు ఏడాది కిందటే  బైబై చెప్పి గుంటూరు వెళ్లిపోయారు. జయప్రకాష్ రెడ్డి కొడుకు గుంటూరులో సెటిల్ అయ్యారు. జేపీ కుమార్తె విజయవాడలో సెటిల్ అయ్యారు. ఆయన అల్లుడు బెజవాడలోనే అసిస్టెంట్ ఇంజనీర్‌‌గా పనిచేస్తున్నారు. ఇలా కొడుకు-కూతురు ఇద్దరూ గుంటూరు–-బెజవాడల్లోనే సెటిల్ అవ్వడంతో జేపీ హైదరాబాద్‌ను వీడివెళ్లారు.

అయితే.. అప్పటికే  స్క్రిప్ట్‌ రాసుకొని.. సూపర్‌‌ స్టార్‌‌ మహేశ్‌బాబుతో సినిమా షూటింగ్‌ బిజీలో ఉన్న అనిల్‌ రావుపూడికి ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. జేపీ వెళ్లిపోయిన సంగతి కూడా టాలీవుడ్‌లో అందరికీ తెలియదు. ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో జేపీ కోసం ప్రత్యేక డైలాగులు రాసిన రావిపూడి ఊరుకోలేదు. దశాబ్దాల పాటు ఇండస్ర్టీకి దూరంగా ఉన్న లేడీ సూపర్ స్టార్‌‌ విజయశాంతినే తన సినిమా కోసం ఒప్పించి తీసుకొచ్చారు. అలాంటిది జేపీ తీసుకురాలేనా అనుకున్నాడు. జేపీ ఆప్యాయంగా గురువు గారు అని పిలుచుకునే అనిల్‌.. జేపీని బలవంతంగా ఒప్పించి మరోసారి హైదరాబాద్‌ తీసుకొచ్చారు.

Also Read: సీమ టపాకాయ్.. నటనలో జేపీ విలక్షణ

విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌కు తండ్రి పాత్ర పోషించిన జేపీకి ఆ సినిమాలో అనిల్‌ రావూపూడి రెండే రెండు డైలాగులు ఇచ్చారు. ఫస్టాఫ్‌ అంతా ‘పీక కోసి..’ అనే డైలాగ్‌ మీద నడిపించగా.. సెకండ్‌ ఆఫ్‌లో ‘కూజాలు చెంబులౌతాయి’ అంటూ చెప్పిన డైలాగ్‌లు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. థియేటర్లలో విజిల్స్‌ పడ్డాయి. ఈ రెండు డైలాగ్స్ సినిమా అంతటికి పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి.

అలా అనీల్ రావిపూడి బలవంతం పెట్టడంతో మరోసారి హైదరాబాద్ వచ్చిన జయప్రకాష్ రెడ్డి.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించి తిరిగి గుంటూరు వెళ్లిపోయారు. ఇప్పుడు ఏకంగా ఈ లోకాన్నే వీడి వెళ్లిపోయారు.