చాలా మంది ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ కొందరే సక్సెస్ అవుతారు. నాలుగు రాళ్లు సంపాదిస్తారు. మిగతా మెజార్టీ నటీనటులు కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా కష్టపడుతారు. సినిమాను ముంచుతుంది.. సినిమానే లేపుతుంది. ఆ డబ్బులను క్యాష్ చేసుకున్న వారే ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. తాజాగా టాలీవుడ్ లో నటుడు రాజారవీంద్ర సైతం తన సినిమా కష్టాలు వల్లె వేశాడు.
బుల్లితెరపై, వెండితెరపై నటుడుగా రాణిస్తున్న రాజారవీంద్ర తాజాగా శ్రీముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానున్న సందర్భంగా ప్రమోషన్ లో హాట్ కామెంట్స్ చేశారు.
‘నాకు సినిమా అంటే పిచ్చి అని.. సినిమాల్లో వేషం దొరక్కపోతే ఆర్టిస్టులకు టీ, కాఫీలు ఇచ్చి బతుకుతాను’ అంటూ నటుడు రాజారవీంద్ర ఏమోషనల్ కామెంట్స్ చేశారు. కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని.. ఎవరికి వైరస్ వచ్చినా అందిరికీ ఇబ్బందేనని తెలిపారు. సినిమా షూటింగ్ లు ఆపేయాల్సి వచ్చిందన్నారు. నాకు సినిమా అంటే పిచ్చి.. ఒకవేళ సినిమా అవకాశాలు లేకపోతే ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు కాఫీ, టీ ఇచ్చుకుంటూ ఇక్కడే బతుకుతానని ఎన్నో సార్లు చెప్పాను. నా దగ్గరికి వచ్చిన ఏ సినిమా అవకాశాన్ని నేను వదులుకోనని.. ప్రత్యేకంగా ఇలాంటి పాత్రలు చేయాలని ఏం పెట్టుకొనని రాజారవీంద్ర చెప్పుకొచ్చారు.
నేను మొదటి నుంచి జీవితాన్ని సీరియస్ గా తీసుకోలేదని.. ఆ ప్రభావం నా కెరీర్ మీద పడిందనుకుంటా.. అందుకే ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నా సమయం లేదు అంటూ రాజారవీంద్ర ఎమోషనల్ అయ్యారు.