
హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందినట్లు డీఎస్పీ నర్సింహులు తెలిపారు. రోడ్డు ప్రమాదం ధాటికి రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటనా స్థలంలో మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.