ప్రజలకు షాక్.. ఈ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా ముప్పు..?

దేశంలో సెకండ్ వేవ్ లో వైద్యులు, శాస్త్రవేత్తల అంచనాలను మించి వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఏ, ఏబీ బడ్‌ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారని భావించారు. అయితే తాజాగా సీఎస్‌ఐఆర్‌ నిర్వహించిన అధ్యయనంలో అధ్యయనంలో మాత్రం బీ, ఏబీ బ్లడ్‌ గ్రూపుల వారికే కరోనా వైరస్ ఎక్కువగా సోకుతుందని తేలింది. ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగ్రాలోని పాథాలజిస్ట్ డాక్టర్ అశోక్ […]

Written By: Navya, Updated On : May 14, 2021 11:38 am
Follow us on

దేశంలో సెకండ్ వేవ్ లో వైద్యులు, శాస్త్రవేత్తల అంచనాలను మించి వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఏ, ఏబీ బడ్‌ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారని భావించారు. అయితే తాజాగా సీఎస్‌ఐఆర్‌ నిర్వహించిన అధ్యయనంలో అధ్యయనంలో మాత్రం బీ, ఏబీ బ్లడ్‌ గ్రూపుల వారికే కరోనా వైరస్ ఎక్కువగా సోకుతుందని తేలింది. ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆగ్రాలోని పాథాలజిస్ట్ డాక్టర్ అశోక్ శర్మ మాట్లాడుతూ ఓ గ్రూపు వారు తక్కువ సెరో-పాజిటివిటీ లేదా ప్రమాదంలో ఉన్నారని తెలిపారు. మాంసాహారం తినేవాళ్లే ఎక్కువగా వైరస్ బారిన పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించడం గమనార్హం. శాఖాహారుల్లో బలమైన రోగనిరోధక శక్తి ఉండటం వాళ్ల ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కరోనా బారిన పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా 10 వేల మందిపై సర్వే నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే బ్రిటిష్‌ కొలంబియా యూనివర్శిటీ, డెన్మార్క్‌లోని ఓడెన్స్‌ యూనివర్శిటీ హాస్పిటల్‌ పరిశోధకులు మాత్రం ఓ బ్లడ్ గ్రూప్ పై వైరస్ ప్రభావం తక్కువగా ఉందని చెబుతున్నారు. శరీర అవయవాలు చెడిపోవడం, మత్యువాత పడడం ఓ బ్లడ్ గ్రూప్ వారిలో తక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో కరోనా మరణాల రేటు 1.09 శాతంగా ఉంది.

దేశంలో కరోనా రికవరీ రేటు 82.39 శాతంగా ఉండగా పాజిటివిటీ రేటు 20 శాతానికి పైనే ఉండటం గమనార్హం. మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.