https://oktelugu.com/

రామచంద్రయ్య ప్లేసులో ఎమ్మెల్సీ దక్కాల్సింది ఆయనకట?

రాజకీయాల్లో జంపింగ్ సిస్టమ్ కామన్. కనురెప్ప వాలేంతసేపట్లో పొలిటికల్ లీడర్స్ పార్టీలు మారుస్తుంటారు. నేటితరం రాజకీయాల్లో అది మరీ ఎక్కువైంది. గతంలో కంటే ఇప్పుడు పార్టీల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో తమ భవిష్యత్ కోసం ఏ పార్టీ అయినా సరే చేంజ్ కావడానికి వెనుకాడడం లేదు. ఈ పరిస్థితి ఏపీలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అది ఎన్నికల సమయంలోనే ఉంటుంది. ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో ఇద్దరు రాజకీయ ఉద్దండులు పార్టీలను పట్టించుకోకుండా మారుతూ ఉంటున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2021 / 10:55 AM IST
    Follow us on

    రాజకీయాల్లో జంపింగ్ సిస్టమ్ కామన్. కనురెప్ప వాలేంతసేపట్లో పొలిటికల్ లీడర్స్ పార్టీలు మారుస్తుంటారు. నేటితరం రాజకీయాల్లో అది మరీ ఎక్కువైంది. గతంలో కంటే ఇప్పుడు పార్టీల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో తమ భవిష్యత్ కోసం ఏ పార్టీ అయినా సరే చేంజ్ కావడానికి వెనుకాడడం లేదు. ఈ పరిస్థితి ఏపీలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అది ఎన్నికల సమయంలోనే ఉంటుంది. ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో ఇద్దరు రాజకీయ ఉద్దండులు పార్టీలను పట్టించుకోకుండా మారుతూ ఉంటున్నారు. ఎప్పుడు..ఎవరు.. ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.

    చీరాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, ఎమ్మెల్యే కరణం బలరాం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి. వారెప్పుడు ఒకే పార్టీలో ఉండరు. టీడీపీ, వైసీపీల మధ్య అటూ ఇటూ తిరుగుతుంటారు. ప్రస్తుతానికైతే ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీలో.. కరణం బలరాం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి మద్దతు ఇచ్చారు. ఈ మధ్య వీరు మళ్లీ వైసీపీలో పొసగక పోవడంతో ఎక్ఛేంజ్ చేసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి.

    కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి కృష్ణ మోహన్ 2014లో ఇండిపెండెంట్ గా గెలిచారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి మారారు. అయితే అప్పటి వరకు వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న టీడీపీలోకి జంప్ చేశారు. కరణం బలరాం కు టీడీపీ టికెట్ ఇవ్వడంతో ఆయన గెలుపొందారు. ఆమంచి వైసీపీలోకి రావడానికి సహించలేని ఆ నియోజకవర్గ నేతలు ఆయనను ఓడించారని చర్చించుకుంటున్నారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో కరణం బలరాంకు మైనస్ అయింది.

    అయితే కరణం బలరాం పరోక్షంగా వైసీపీకి మద్దతు ఇస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని వైసీపీలో చేర్పించారు. దీంతో ఆమంచి కృష్ణ మోహన్ తన పరిస్థితిని వివరించేందుకు జగన్ ను కలిసి వినతిపత్రం అందించారు. అయితే తనకు పర్చూర్ ఇన్ చార్జిగా వెళ్లమని చెప్పాడు. కానీ ఆమంచి ససేమిరా అంటున్నాడు. ఇదే తరుణంలో కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్యకు ఇటీవల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ వస్తుందని ఆశించిన ఆమంచి పరిస్థితి ఎటూకాకుండా పోయింది. నిజానికి రామచంద్రయ్య ప్లేసులో ఆమంచికే ఎమ్మెల్సీ రావాల్సి ఉండేది. కానీ చీరాలలో అసమ్మతి రాజేయడం.. మాట వినకపోవడం వల్లే పదవి దూరమైందట..

    ఇదిలా ఉండగా ఆమంచికి టీడీపీ నుంచి మంచి ఆఫర్ వచ్చిందట. ప్రస్తుతానికి ఓ ఇన్ చార్జి పోస్టు ఇస్తామని, ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పారట. దీంతో ఆమంచి ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. అయితే కార్యకర్తల నిర్ణయం మేరకు తన నిర్ణయం ఉంటుందుని చెబుతున్నారట. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.