
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. మరికొన్ని రోజుల్లో హోళీ పండుగ ఉన్న నేపథ్యంలో కేంద్రం ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ను అమలులోకి తెచ్చింది. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో ఉద్యోగులకు ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద 4,500 రూపాయలు ఇచ్చిన కేంద్రం ప్రస్తుతం ఏకంగా 10,000 రూపాయల మొత్తాన్ని ఇస్తోంది.
ఉద్యోగులు ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద పొందిన మొత్తాన్ని నెలకు 1,000 రూపాయల చొప్పున తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. ఎవరైతే ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద నగదు తీసుకుంటారో వాళ్లు ఈ నెల 31వ తేదీ లోపు స్కీమ్ కింద డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద అందించే మొత్తానికి ఎటువంటి వడ్డీని వసూలు చేయదు. నెలకు కేవలం 1,000 రూపాయల చొప్పున తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను 6వ వేతన సంఘం కింద అమలు చేస్తుండటం గమనార్హం. ప్రభుత ఉద్యోగులకు కేంద్రం ప్రీపెయిడ్ రూపే కార్డ్ రూపంలో ఈ రుణం పొందే అవకాశం కల్పించింది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఉద్యోగులకు అవసరమైతే పండుగల అడ్వాన్స్ లను ముందస్తుగా ఇవ్వవచ్చని చెబుతుండటం గమనార్హం. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
మరోవైపు మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట కలిగేలా ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం కేంద్రం డియర్‌నెస్ అలవెన్స్ తో పాటు డియర్‌నెస్ రిలీఫ్ ను పునరుద్ధరించనుందని తెలుస్తోంది. ఎవరైతే అవసరం ఉందని భావిస్తారో వాళ్లు ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ను ఉపయోగించుకోవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.