
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతుంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 24,171 మంది కరోనా బారిన పడగా 101 మంది మరణించారు. కాగా 21,101 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. నూతన కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 14,35,491 కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,10,436 గా ఉంది రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ తో ఇప్పటి వరకు 9,372 మంది మరణించారు.