యాక్సిడెంట్ చేస్తే 20 లక్షలు ఇవ్వాలి.. లేదంటే 14 ఏళ్ల జైలు

చేతిలో వాహనం ఉంటే చాలు ఆకాశంలో విహరిస్తున్నట్టు చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా యువతకు బైక్ చేతిలో ఉంటే పట్టపగ్గాలు ఉండవు. యాక్సిడెంట్లు చేసి చంపినా.. వారిని తీవ్ర గాయాలు పాలు చేసిన చట్టాల ప్రకారం పెద్ద శిక్షలు పడవు. మన రాజ్యాంగంలో యాక్సిడెంట్లు చేసిన వారిపై పెద్దగా శిక్షార్హులు కారని పెట్టడంతో యాక్సిడెంట్ల బాధితులు నిండా మునుగుతుండగా.. చేసిన వారు స్వల్ప శిక్షలతో బయటపడుతున్నారు. ఇక ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి […]

Written By: NARESH, Updated On : January 31, 2021 9:14 pm
Follow us on

చేతిలో వాహనం ఉంటే చాలు ఆకాశంలో విహరిస్తున్నట్టు చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా యువతకు బైక్ చేతిలో ఉంటే పట్టపగ్గాలు ఉండవు. యాక్సిడెంట్లు చేసి చంపినా.. వారిని తీవ్ర గాయాలు పాలు చేసిన చట్టాల ప్రకారం పెద్ద శిక్షలు పడవు. మన రాజ్యాంగంలో యాక్సిడెంట్లు చేసిన వారిపై పెద్దగా శిక్షార్హులు కారని పెట్టడంతో యాక్సిడెంట్ల బాధితులు నిండా మునుగుతుండగా.. చేసిన వారు స్వల్ప శిక్షలతో బయటపడుతున్నారు.

ఇక ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాదభీమా వర్తించదు. అదే విధంగా ప్రభుత్వ పథకాలు ఏవీ వర్తించవు. ప్రమాదం పాలైన వారికి ఏ విధమైన పరిహారం వర్తించదు. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబందనలు వర్తిస్తాయి. బాధితులకు ఏ విధమైన బీమా వర్తించదు. సక్రమమైన మార్గంలో వచ్చే వ్యక్తిపై ఎటువంటి కేసులు ఉండవు. మద్యంసేవించి నడిపే వారికి కూడా ఏ విధమైన బీమా వర్తించదు.

రాంగ్ రూట్లలో వచ్చే వారి వల్ల ఇతరులకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం చేసిన వ్యక్తి పేరుతో ఉన్న ఆస్తిలో 20 లక్షల రూపాయలు ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వ్యక్తికి పరిహారం ఇవ్వాలని తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇకవేళ 20 లక్షలు ఇవ్వలేని స్థితిలో ఉంటే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు.వారి లైసెన్సులు రద్దు చేస్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా సంస్థలు, రవాణాశాఖ , ప్రభుత్వం సంయుక్తంగా ఏప్రిల్ 1వ తారీకు 2021 నుంచి ఖచ్చితంగా ఈ కఠిన నిర్ణయాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇక యాక్సిడెంట్లు చేస్తే 20 లక్షలైనా కట్టాలి లేదంటే 14 ఏళ్లు జైలు శిక్ష అయినా అనుభవించాలి.. సో బీ అలెర్ట్..