కేసీఆర్ వచ్చాడు.. జగన్ వెళుతున్నాడు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న.. మొన్నటిదాకా ఢిల్లీలోనే మకాం వేశారు. ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులతో వరుసగా భేటి అయ్యారు. ఈక్రమంలోనే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు.. హైదరాబాద్లో వరదసాయం.. ఎయిర్ పోర్టులకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించి వచ్చారు. కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగి రాగానే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. ఈమేరకు బీజేపీ పెద్దలను కలుసుకొని తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాలను వారికి వివరించారు. తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశం […]

Written By: Neelambaram, Updated On : December 14, 2020 7:18 pm
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న.. మొన్నటిదాకా ఢిల్లీలోనే మకాం వేశారు. ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులతో వరుసగా భేటి అయ్యారు. ఈక్రమంలోనే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు.. హైదరాబాద్లో వరదసాయం.. ఎయిర్ పోర్టులకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించి వచ్చారు.

కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగి రాగానే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. ఈమేరకు బీజేపీ పెద్దలను కలుసుకొని తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాలను వారికి వివరించారు. తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి కేసీఆర్ పై నిప్పులు చెరిగాయి. కేసీఆర్ ఢిల్లీ టూర్ కేవలం ప్రజల దృష్టిని మరలించేందుకేనంటూ విమర్శలు గుప్పించారు.

ఇక తాజాగా ఏపీ సీఎం జగన్ సైతం రేపు ఢిల్లీ వెళ్లనుండటం ఆసక్తిని రేపుతోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగియగానే జగన్ ఢిల్లీ వెళ్లనుండటంతో అందరి చూపు ఈ పర్యటనపై పడింది. సీఎం జగన్ సైతం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటి కానుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

సీఎం జగన్ మంగళవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఢిల్లీ పర్యటనకు బయల్దేరి 4గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. రాత్రి 9గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారని సమాచారం. ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించనున్నారు.

కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు.. విభజన సమస్యల పరిష్కారంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. వరదలతో నష్టపోయిన ఏపీకి కేంద్రం సాయం చేయాలని జగన్ రెండ్రోజుల క్రితమే లేఖ రాశారు. తాజాగా ఢిల్లీలో ఈ అంశాన్ని హోంమంత్రిని దృష్టికి తీసుకెళ్లనున్నారు. అయితే కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే జగన్ ఢిల్లీకి వెళుతుండటం ఆసక్తిని రేపుతోంది.