KTR Comments on Amit Shah: తెలంగాణ ప్రభుత్వం కుటుంబ పార్టీ అని బీజేపీ నేతలు అదే పనిగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ కూడా బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తీవ్రంగా విరుచుకపడుతున్న క్రమంలో మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. తమది కుటుంబ పార్టీ అన్నప్పుడు కేంద్రహోంమంత్రి అమిత్ షా కొడుకు జై షాకు బీసీసీఐలో ఆ పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో సహా దేశంలో అన్ని వారసత్వ పార్టీలు అని, తమది మాత్రం ప్రత్యేకం అంటూ బీజేపీ వాళ్లు చెప్పుకుంటున్నారు.
అయితే, బీజేపీలో కూడా చాలా మంది కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆ మధ్య లిస్టు తీస్తే కమలం పార్టీలో కూడా బోలెడంత మంది వారసులు రాజకీయ పదవులను అనుభవిస్తున్నారు. అయినా, బీజేపీ మాత్రం తమది వారసత్వ పార్టీ కాదని విలువలతో కూడిన రాజకీయాలు తమ సొంతం అంటూ ప్రతీ ఎన్నికలు, మీటింగుల్లో ప్రచారం చేస్తోంది. ప్రధాని మోడీ కుటుంబ సభ్యుల్లో ఎవరూ రాజకీయాలు, పదవుల్లో లేకపోతే తమది కుటుంబ పార్టీ కదా..? అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ అంశంపైనే మంత్రి కేటీఆర్ ప్రశ్నించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: బీజేపీని రెచ్చగొడుతున్న టీఆర్ఎస్.. ఆశిస్తుందేంటీ?
తాజాగా ఓ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అమిత్ షా తనయుడి సంగతి ఏంటని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన బీసీసీఐ బోర్డులో కీలక పదవిలో ఉన్నాడు జై షా.. ఆయనకు ఆ పదవి ఎలా వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. అమిత్ షా కొడుకు రాజకీయ పదవిలో లేకపోవచ్చు. కానీ బీసీసీఐలో అసలు పదవి ఎలా వచ్చింది. బీసీసీఐలో జై షా ఎలా చక్రం తిప్పగలుగుతున్నారు.
మోడీ, అమిత్ షాకు ఏం తెలియకుండానే ఇదంతా జరుగుతుందా? అని అడిగారు. వాస్తవానికి బీసీసీఐలో లోథా సంస్కరణలు అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అవే గనుక అమలైతే గంగూలీతో సహా అనేక మంది ఇప్పుడు అనుభవిస్తున్న పదవులకు దూరమవుతారు.
Also Read: జైలు నుంచి బండి సంజయ్ విడుదల.. కేసీఆర్ ను జైలుకు పంపిస్తానని శపథం
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Minister ktr serious comments on union home minister amit shah
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com