Mahesh Babu And Namrata: సూపర్ స్టార్ మహేష్ తండ్రి అలనాటి మొదటి తరం సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నేడు. అయన నేడు తన 80వ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో సినీ ప్రముఖులు కూడా కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కృష్ణతో తమకు ఉన్న అనుబంధాన్ని కొందరి సినీ దిగ్గజాలు గుర్తు చేసుకుంటున్నారు.
మరోపక్క హీరో మహేష్ బాబు తన తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రస్తుతం మహేష్ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంతకీ మహేష్ ఏమని ట్వీట్ చేశాడు అంటే.. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా..! మీలాంటి వారు నిజంగా ఎవరూ లేరు. రాబోయే చాలా రోజుల్లో మీరు మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యూ..’ అని మహేష్ పోస్ట్ చేశాడు.
Also Read: Sonam Kappor Baby Bump: చాలా క్లారిటీగా తన బేబీ బంప్ చూపించేసిన సోనమ్ కపూర్
అలాగే, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా తన ఇన్ స్టాగ్రామ్లో తన మామయ్యకు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. నమ్రతా మాటల్లోనే.. ‘మామయ్యగారు మీతో గత కొన్నేళ్లుగా మాకు చాలా ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు, నా జీవితంలో చాలా ప్రేమ, నవ్వు, దయ, ఆనందాన్ని తెచ్చారు. నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. మీరు నా భర్తకు, నాకు మా అందరికీ తండ్రి అయినందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్యా.. మేము నిన్ను ప్రేమిస్తున్నాం’ అని ఆమె ట్వీట్ చేసింది.
హీరో కృష్ణగారి గురించి మీతో ఒక సంఘటన పంచుకోవాలి. కృష్ణకు మొదటి సినిమా ‘తేనె మనసులు’. ఈ సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారే కృష్ణను హీరోని చేశారు. ఆ తర్వాత కాలంలో కృష్ణ సూపర్ స్టార్ అయ్యారు. అయితే ‘పాడిపంటలు’ సినిమా షూటింగ్ కోసం కృష్ణ గుంటూరుకి వచ్చారు. అప్పుడు ఆదుర్తి వారు మరణించారనే విషయం కృష్ణకు తెలిసింది.
తనను హీరోని చేసిన దర్శకుడిని ఆఖరి చూపు చూసేందుకు త్వరగా వెళ్ళాలి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. కానీ ఆ రోజుల్లో రవాణా సదుపాయాలేవీ లేవు. ఆఖరికి ‘ది హిందూ’ పత్రిక యాజమాన్యం వారిని అభ్యర్థించి, వారి ప్రత్యేక విమానంలో హుటాహుటిన మద్రాసు చేరుకున్నారు కృష్ణ. జీవచ్ఛంలా పడిఉన్న ఆదుర్తి సుబ్బారావు గారిని అలా చూడలేక కృష్ణ వెక్కి వెక్కి ఏడ్చారు. కృష్ణ హృదయం అంత సున్నితమైనది.
Also Read:Superstar Krishna: ‘సూపర్ స్టార్ కృష్ణ’ సాధించిన ఘనతలు ఇవే.. కృష్ణా సరిలేరు నీకెవ్వరు
Happy birthday Nanna! There is truly no one like you. Wishing for your happiness & good health for many more years to come. Stay blessed always. Love you ♥️🤗🤗 pic.twitter.com/rJKvVQoHQq
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2022
Recommended Videos
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Mahesh babu and namrata special birthday wishes to super star krishna
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com