Youtuber Anvesh Earnings 2025 : యూట్యూబ్ లో స్టార్ స్టేటస్ ని దక్కించుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. రోజుకి లక్షల సంఖ్యలో యూట్యూబ్ చానెల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యి , డబ్బులు సంపాదించాలి అనుకోవడం, కత్తి మీద సాము లాంటిదే. అలాంటి రంగం లో 40 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకొని, ప్రపంచం మొత్తం తిరిగి అద్భుతమైన వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు అన్వేష్ (Youtuber Anvesh). ‘నా అన్వేషణ'(Naa Anveshana), ‘ప్రపంచ యాత్రికుడు'(Prapancha Yatrikudu) చానెల్స్ ద్వారా ఆయన అందించిన కంటెంట్ అసామాన్యమైనది. 120 దేశాలు తిరిగి, అక్కడి జనాల అలవాట్లు , నాగరికత వగైరా వంటివి పరిచయం చేయడమా అనేది నిజంగా అసాధారణమైన విషయమే. అయితే ఈమధ్య కాలం లో అతని చుట్టూ జరుగుతున్నా వివాదాలను చూస్తూనే ఉన్నాం. శివాజీ మ్యాటర్ దగ్గర నుండి మొదలు పెట్టి, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసే రేంజ్ కి వెళ్ళాడు.
ఏ జనాలు అయితే అన్వేష్ ని మెచ్చుకొని ఈ స్థాయికి తీసుకొచ్చారో, ఇప్పుడు వాళ్ళే ఇతన్ని క్రిందకు నెట్టేస్తున్నారు. ఎట్టిపరిస్థితిలోనూ అన్వేష్ ని ఇండియా కి రప్పించి అరెస్ట్ చేయాలంటూ జనాలు డిమాండ్ చేస్తున్నారంటే, ఇతని నోటి దూల ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదంతా పక్కన పెడితే 2025 వ సంవత్సరం లో అన్వేష్ తన రెండు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ఎంత సంపాదించాడో రీసెంట్ గా చేసిన ఒక వీడియో లో చెప్పుకొచ్చాడు. ‘నా అన్వేషణ’ ఛానల్ మీద 2025 వ సంవత్సరం లో 80 లక్షల రూపాయిలు సంపాదించానని, అదే విధంగా ప్రపంచయాత్రికుడు యూట్యూబ్ ఛానల్ మీద 60 లక్షల రూపాయిలు వచ్చాయి. అంటే 2025 వ సంవత్సరం లో కోటి 40 లక్షలు వచ్చాయట. ఒక యూట్యూబర్ కి ఈ రేంజ్ సంపాదన అంటే సాధారణమైన విషయం కాదు.
అయితే ప్రస్తుతం జరుగుతున్న వివాదాల కారణంగా అతనికి రెండు చానెల్స్ నుండి 5 లక్షల మంది యూజర్స్ వెళ్లిపోయారు. రోజుకి 40 వేల మందికి పైగా ఈ రెండు చానెల్స్ నుండి తగ్గిపోతూ వస్తున్నారు. వ్యూస్ కూడా సగానికి సగం పడిపోయాయి. మళ్లీ కోలుకోవడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే త్వరలో ఆయన రెండు యూట్యూబ్ చానెల్స్ బ్యాన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే అన్వేష్ పరిస్థితి జీరో కి వచ్చేస్తుంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.