Homeలైఫ్ స్టైల్YouTube Queen Sejal Kumar: యూట్యూబ్ ప్రపంచంలో "క్వీన్ "సెజల్ కుమార్

YouTube Queen Sejal Kumar: యూట్యూబ్ ప్రపంచంలో “క్వీన్ “సెజల్ కుమార్

YouTube Queen Sejal Kumar: సెజల్ కుమార్..ఈ పేరు యూట్యూబ్ ప్రపంచంలో ఓ సంచలనం.. భారతీయ యూట్యూబర్ గా ఆమె తన యూట్యూబ్ ఛానెల్‌ ను 2014 ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఫిబ్రవరి 2021నాటికి, ఆమెకు ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. 199 మిలియన్లకుపైగా వ్యూస్ ఉన్నాయి. ఆమె ఇటీవలే ప్రాజెక్ట్ క్రియేటర్స్ ఫర్ చేంజ్‌లో తన మొదటి ఒరిజినల్ సాంగ్ “ఐసి హన్” ను విడుదల చేసింది.

YouTube Queen Sejal Kumar
YouTube Queen Sejal Kumar

సామాజిక సమస్యలపై పోరాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్ఫూర్తిదాయకమైన యూట్యూబర్లను ప్రతి ఏటా యూట్యూబ్ ఎంపిక చేస్తుంది. ఆ జాబితాలో భారత దేశం తరఫున సేజల్ కుమార్ యూట్యూబ్ క్రియేటర్స్ ఫర్ చేంజ్ అంబాసిడర్ గా స్థానం సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా బాలికల విద్య ను ప్రోత్సహించే ప్రాజెక్టులో భాగంగా సెజల్ కుమార్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీతో కలిసి పని చేయనున్నారు. యూట్యూబ్ ప్రపంచంలో తనదైన శైలిలో ముద్రవేసింది సెజల్‌ కుమార్‌. ఫ్యాషన్‌ వీడియోలతోపాటు, స్కెచెస్, ట్రావెలాగ్స్, డాన్స్, మ్యూజిక్‌ వీడియోలు రూపొందిస్తూ యూట్యూబ్ క్వీన్ గా మారింది. మిలియన్ల కొద్దీ వీక్షకులను ఆకట్టుకుంటూ సమాజానికి సందేశం ఇస్తోంది. యువత ఆసక్తులు, అభిరుచులకు తగిన వీడియోలు రూపొందిస్తూ సంచలనం సృష్టిస్తోంది. 2014లో యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించింది. మొదట్లో ఆమె ఎన్నో అవమానా లను ఎదుర్కొంది. ఇప్పుడు సెజల్ విజయాన్ని చూసి విమర్శించి న వారే ప్రశంసిస్తున్నారు. ఢిల్లీ కి చెందిన డాక్టర్‌ అంజలీ కుమార్, అనిల్‌ కుమార్‌ ఆమె తల్లిదండ్రులు. తల్లి డాక్టర్‌. తండ్రి రిటైర్డ్‌ ఆర్మీ మేజర్‌. సెజల్‌కు ఒక అన్న రోషన్‌. ఇంటర్‌ వరకూ సెజల్‌ చాలా బిడియ పడుతుండేది. ఎంతో దగ్గరి సన్నిహితులతో తప్ప బయటవాళ్లతో పెద్దగా కలిసేది కాదు . శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఢిల్లీ యూనివర్శిటీ)లో డిగ్రీ చేస్తున్నప్పుడు సెజల్‌ ఆలోచన మారింది. మొదటి నుంచీ వీడియోగ్రఫీ అంటే ఇష్టపడేది. తన దగ్గరున్న వీడియోతో తనకు నచ్చినవి తీస్తూ ఉండేది. టర్కీ వె ళ్లే టప్పుడు తన పరిశీలనల ను వీడియో రూపంలో చిత్రీకరించింది. అలాగే టర్కీలో సీజన్‌ ఫ్యాషన్‌ను కాప్చర్‌ చేసింది. ఎడిటింగ్‌ చేసి ‘‘సమ్మర్‌ స్టయిల్‌ ఇన్‌ టర్కీ’’ అనే పేరుతో ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌చేసింది . దీనికి మంచి స్పందన వచ్చింది. ఆసమయం లోనే సెజల్‌ తన లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నది. టర్కీ నుంచి వచ్చాక యూట్యూబ్‌ చానల్‌నే ప్రధాన వ్యాపకంగా పెట్టుకున్నది. సెజల్‌ తన వీడియోలకు కంటెంట్‌ రాసుకోవడాన్నే ఎక్కువ ఆస్వాది స్తుంటుంది. ఆమె వీడియోలకున్న క్రేజ్‌ చూసే లైఫ్‌స్టయిల్, సామ్‌సంగ్‌ కంపెనీ లు ఆమె ఇంటి ముందు క్యూ కట్టాయి. ఇదంతా తాను ఊహించని అచీవ్‌మెంట్‌’’ అంటుంది సెజల్‌. యూట్యూబ్‌ స్టార్‌ ‘బెథాని మోటా’ సెజల్‌కు రోల్‌మోడల్‌. తన చానల్‌ సబ్‌స్క్రైబర్స్‌తో మాట్లాడ్డం.. వాళ్ల కామెంట్స్‌కు రిప్లయ్‌ ఇవ్వడం అంటే సెజల్‌కు చాలా ఇష్టం.

YouTube Queen Sejal Kumar
Sejal Kumar

Also Read: CM Jagan On Meters: ఏపీలో ఉచిత విద్యుత్ ఎత్తేస్తారా? వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు

అవార్డుల పంట…

సేజల్ కుమార్ కాస్మోపాలిటన్ ఇండియా బ్లాగర్ అవార్డ్స్ బెస్ట్ వ్లాగ్ అవార్డ్ 2018ని గెలుచుకున్నారు. అంతేకాదు కాస్మోపాలిటన్ ఇండియా బ్లాగర్ అవార్డ్స్ 2019లో బెస్ట్ లైఫ్‌స్టైల్ బ్లాగర్‌ గా ఎంపికయ్యారు. ఉమెన్ ఆఫ్ స్టీల్ సమ్మిట్ లో ఉత్తమ యూత్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డును అందుకున్నారు సేజల్. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాషన్ అకౌంట్ ఆఫ్ ది ఇయర్ 2018 అవార్డును గెలుచుకున్నారు. అంతేకాదు టాప్ 5000 ఇన్‌ఫ్లుయెన్సర్స్ 2019 ఎగ్జిబిట్ మ్యాగజైన్ అవార్డును గెలుచుకున్నారు. ఫ్యాషన్ విభాగంలో 2019 ఇన్‌స్టాగ్రామర్ ఆఫ్ ది ఇయర్‌ను గెలుచుకున్నారు.

YouTube Queen Sejal Kumar
Sejal

Also Read: AP SSC Results: పదో తరగతి పరీక్ష ఫలితాల ప్రకటనలో ఏపీ సర్కారు తొండాట

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular