https://oktelugu.com/

Telugu States: తెలుగు రాష్ట్రాల్లో తప్పక సందర్శించాల్సిన ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఇవే

డబ్బులు పోసుకుని పొరుగు రాష్ట్రాల్లో ఉన్న నదులు, జలపాతాలకు వెళ్తుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లోనే అనేక అందమై, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 13, 2024 / 10:58 AM IST

    You must visit places in Telugu States

    Follow us on

    Telugu States: వేసవి సెలవులు రాబోతున్నాయి. మరో నెల రోజుల్లో విద్యా సంవత్సరం ముగియనుంది. దీంతో అందరూ సమ్మర్‌ వెకేషన్‌ టూర్స్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే అనేక ప్రకృతి రమణీయ దృశ్యాలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు. తెలంగాణ, ఏపీలో కృష్ణ, గోదావరి జీవనదులు ప్రవహిస్తున్నాయి.తెలంగాణలో ప్రాణహిత, ఏపీలో సముద్రం ప్రకృతి రమణీయతకు నెలవు. కానీ, చాలా మందికి వాటి గురించి తెలియదు. సందర్శించే వారూ తక్కువే. డబ్బులు పోసుకుని పొరుగు రాష్ట్రాల్లో ఉన్న నదులు, జలపాతాలకు వెళ్తుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లోనే అనేక అందమై, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

    తెలంగాణలో తప్పక చూడాల్సిన 6 ప్రదేశాలు..

    1. వేయి స్తంభాల గుడి..
    – తెలంగాణలో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో వేయి స్తంభాల గుడి ఒకటి. వరంగల్‌లో ఉన్న ఈ గుడిని 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు నిర్మించాడు. గతంలో ధ్వంసమైన ఈ గుడిని ఇటీవలే పునరుద్ధరించారు. యునెస్కో కూడా ఇటీవల చారిత్రక కట్టడంగా గుర్తింపు ఇచ్చింది.

    2. లక్నవరం సరస్సు..
    తెలంగాణలో తప్పక చూడాల్సిన మరో ప్రాంతం వరంగల్‌ జిల్లాలోనే ఉంది. అది లక్నవరం సరస్సు. ఇది వరంగల్‌ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోదవిందరావుపేట మండలం లక్నవరం గ్రామంలో ఈ సరస్సు ఉంది. ఈ ప్రాంతంలో తీగల వంతెన నిర్మించారు. ఇది కూడా తప్పక చూడాల్సిన ప్రదేశం.

    3. బొగత జలపాతం
    – తెలంగాణ రాష్ట్రంలోని రెండో అతిపెద్ద వాటర్‌ ఫాల్‌ ఇది. ములుగు జిల్లాలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉంది. కాళేశ్వరం – భద్రాచలం అడవుల మధ్య ఉన్న ఈ జలపాతం కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి.

    4. కనకాయ్‌ జలపాతం..
    కనకాయ్‌ జలపాతం.. ఇది కూడా తెలంగాణలో చూడాల్సిన ప్రకృతి రమణీయ ప్రదేశాల్లో ఒకటి. దీనిని కనకదుర్గ జలపాతం అని కూడా అంటారు. తెలంగాణలోని గిర్నేర్‌ గ్రామంలో ఉండే ఈ జలపాతాన్ని తప్పకుండా విజిట్‌ చేయాలి.

    5. కిన్నెరసాని అభయారణ్యం..
    – ఇక తెలంగాణలో సందర్శించాల్సిన మరో పర్యాట ప్రదేశం కిన్నెరసాని అభయారణ్యం. ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యాన్ని కచ్చితంగా చూడాల్సిందే. ఈ అరణ్యం చుట్టూ గోదావరి ప్రవహిస్తుంది. అనేక వన్యప్రాణులు ఇక్కడ ఆవాసం పొందుతున్నాయి. ఇక్కడ కిన్నెరసాని జలాశయంలో బోటింగ్‌ కూడా ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

    6. పాతాళ గంగ..
    శ్రీశైలంలో ఉన్న పాతాళ గంగను కచ్చితంగా సందర్శించాల్సిందే. ఈ నది మల్లికార్జునుడి ఆలయానికి సమీపంలోని లోయలో ఉంటుంది. పాపాలను పోగొట్టే పరమ పవిత్ర ప్రదేశంగా దీనిని భక్తులు భావిస్తారు.

    ఏపీలో సందర్శించాల్సిన 5 ప్రదేశాలు ఇవీ..

    ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా అనేక ప్రకృతి రమణీయ దృశ్యాలు ఉన్నాయి. వాటిలో 5 ప్రదేశాల గురించి కూడా తెలుసుకుందాం.

    1. వైజాగ్‌ బీచ్‌లు..
    వైజాగ్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది బీచ్‌లే. ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, భీమిలి బీచ్‌ ఇలా ఐదారు బీచ్‌లు ఉన్నాయి. వైజాగ్‌ పర్యాటకులు కచ్చితంగా వీటిని సందర్శించాలి.

    2. అరకు..
    వైజాగ్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి సుందరమైన ప్రదేశం అరకు. ఇక్కడి ప్రకృతి అందాలు, పచ్చని చెట్ల మధ్య లోయలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. వైజాగ్‌ వెళ్లినవాళ్లు తప్పక చూడాల్సిన ప్రదేశం ఇదీ.

    3. సింహాచలం ఆలయం..
    ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించాల్సిన మరో పర్యాటక ప్రదేశం సింహాజలం అప్పన్న ఆలయం. విశాఖపట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈగుడిలో సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీనర్సింహస్వామి కొలువై ఉన్నాడు. విశాఖ పర్యాటకులు ఈ ప్రదేశాన్ని మిస్‌ కావొద్దు.

    4. అరసవల్లి సూర్యనారాయణ టెంపుల్‌
    శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి సూర్యనారాయణ టెంపుల్‌ను తప్పక సందర్శించాలి. దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైక సూర్య దేవాలయం ఇదీ. దీనికి కచ్చితంగా సందర్శించండి.

    5. కలింగపట్నం బీచ్‌..
    శ్రీకాకులం జిల్లాలోని బెస్ట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌లలో ఒకటి కలింగప్నం బీచ్‌. ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. శ్రీకాకుళం పర్యాటకులు ఈ బీచ్‌ను కచ్చితంగా విజిట్‌ చేయాలి.