OKtelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బ్రిటీష్ నటుడు ఎడ్ వెస్ట్విక్‌తో నటి అమీ జాక్సన్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. గతేడాది సౌదీలో జరిగిన ఓ ఫిలిం ఫెస్టివల్‌లో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారని, ఆ పరిచయం డేటింగ్ వరకు వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈమె వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో సహజీవనం చేసింది. వీరికి ఓ బాబు జన్మించాడు. అయితే మనస్పర్థలు రావడంతో విడిపోయారు. మద్రాసు పట్టణం, ఎవడు, ఐ, రోబో 2.0 చిత్రాల్లో ఈమె నటించింది.

మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. కాంట్రవర్సీ ట్వీట్లతో వార్తల్లో నిలిచే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈసారి కొటేషన్ షేర్ చేశాడు. ‘నిరంతరం కష్టపడే వాడు కూలోడవుతాడు. అసలేం కష్టపడకుండా ఆ కూలోడితో అతి తక్కువ డబ్బులిచ్చి పని చేయించుకునే వాడు ధనికుడవుతాడు’ అని ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ఇది నిజమని.. కూలోడు లేకుండా ఎవ్వరూ ధనవంతులు కాలేరని నెటిజన్స్ రిప్లైలు ఇస్తున్నారు.
Also Read: సన్నాఫ్ ఇండియా’ తొలి రోజు కలెక్షన్లు షాకింగ్.. ఎంతో తెలిస్తే ఫసక్కే

మరో అప్ డేట్ ఏమిటంటే.. కిరణ్ అబ్బవరం ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన కథానాయకుడిగా ప్రమోద్ – రాజు కలిసి ‘సెబాస్టియన్ PC 524’ సినిమాను నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతాన్ని అందించాడు.

కాగా తాజాగా ఒక పాటను విడుదల చేశారు. ‘నీ మాటే వింటే రాదా మైమరపే .. నీ పేరు అంటే రాదా మైమరపే, నేను ఎవరో తెలిసింది నీవల్లే .. నువ్వు లేని నేను నేను కాదులే’ అంటూ ఈ పాట సాగుతోంది.
Also Read: ఏపీలో 126 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. భారీ వేతనంతో?