WhatsApp: వాట్సాప్ మరింత వినూత్నంగా మారుతోంది. వినియోగదారులకు మెరుగైన సేవలందించే క్రమంలో ఎన్నో కొత్త పద్ధతులు తీసుకొస్తోంది. దీంతో ప్రజలకు మరింత అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ కే ప్రాధాన్యత ఏర్పడింది. వాట్సాప్ వాడని ఉండరంటే అతిశయోక్తి కాదేమో. రోజురోజుకు తనదైన శైలిలో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. సోషల్ మీడియాలో వాట్సాప్, గూగుల్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటివి ఉన్నా అందులో వాట్సాప్ కే విలువ ఏర్పడింది. సులభంగా ఉండటంతో అందరు వాట్సాప్ ను వాడుతున్నారు.

యూజర్ల కోసం వాట్సాప్ యాజమాన్యం కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తోంది. గతంలో మెసేజ్ చేసే సభ్యుల ఫొటో కనిపించేది కాదు. ఇక మీదట మనం మెసేజ్ చేసే సమయంలో మెసేజ్ తో పాటు మన ఫొటో కూడా గ్రూప్ చాట్ లో కనిపించనుంది. దీంతో వాట్సాప్ తీసుకున్న నిర్ణయంతో ఇక మీదట వాట్సాప్ కొత్తదనం సంతరించుకోనుంది. దీనికి గాను అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వినియోగదారుల సూచనలు, సలహాల మేరకు వాట్సాప్ గ్రూప్ తన స్వరూపాన్ని మార్చుకోనుంది. మరిన్ని కొత్త తరహా పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ అందరిని ఆకర్షిస్తోంది.
ఇది అందుబాటులోకి వస్తే ఇక మీదట గ్రూపు సభ్యుల ఫొటోలు చూడటానికి వారి ప్రొఫైల్ ను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. వారి ఫొటో కూడా గ్రూప్ చాట్ లోనే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులోకి రానుంది. కొద్ది రోజుల్లో ఇది అందరికి ఉపయోగంలోకి రానుంది. దీంతో వాట్సాప్ తీసుకువస్తున్న నూతన విధానాలతో వినియోగదారులకు ఎన్నో లాభాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ యాజమాన్యం చేపడుతున్న చర్యలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.

ఇటీవల వాట్సాప్ ఓ రెండు గంటలు నిలిచిపోవడంతో ఎంతో నష్టం సంభవించింది. దానిపై అందరు ఫిర్యాదులు చేశారు. వాట్సాప్ అంతలా ప్రజలకు చేరువైంది. కొత్త విధానాలతో మరింత ముందుకు పోతోంది. ఈ క్రమంలో వాట్సాప్ సరళతరమైన విధానాలతో ప్రజలకు ఎప్పుడు చేరువవుతూనే ఉంది. దీనికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.