Almond Milk : : ఎండ దంచి కొడుతోంది. మార్చి నెలలోనే ఏప్రిల్, మే లో మాదిరి పరిస్థితి ఉంది. వచ్చే రోజుల్లో ఇలా ఉంటుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఏదన్నా పని మీద బయటకు వెళ్తే.. ఇంటికి వచ్చేసరికి శరీరం నీరసానికి గురవుతోంది. ఇలాంటప్పుడు శరీరానికి సత్వర శక్తిని అందించాలి. లేకుంటే పరిస్థితి చేయి దాటిపోతుంది. సాధారణంగా ఎండాకాలంలో చాలామందికి చల్లచల్లని బాదం పాలు తాగడం అలవాటు. అయితే బయటి బాదంపాలు ఆరోగ్యానికి అంత సురక్షితం కాదు. పైగా అందులో ఫ్లేవర్ కోసం రకరకాల రసాయనాలు వాడుతారు. అలాంటప్పుడు బాదం పాలను ఇంట్లోనే చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం.
కావలసిన పదార్థాలు
బాదం పప్పులు- ఒక కప్పు (ఎక్కువ పరిమాణంలో కావాలి అంటే.. ఎక్కువ తీసుకోవచ్చు)
జీడిపప్పు- ఒక కప్పు
చక్కర – 100 గ్రాములు.. ఎక్కువ తీపి కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.
యాలకుల పొడి -ఒక స్పూన్.. రుచి మరింతగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు.
పాలు – అర లీటర్..(ఒకవేళ ఎక్కువ పాలు కావాలనుకుంటే మరిన్ని ఎక్కువ తీసుకోవచ్చు)
ఎలా తయారు చేయాలంటే..
బాదంపప్పులను, జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న తీయని పాలను వేడి చేసుకోవాలి. అలా వేడిగా ఉన్న పాలలో యాలకుల పొడి, చక్కర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పోటీ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పొడిని అందులో కలపాలి. అనంతరం చిన్న మంట మీద పది నుంచి 15 నిమిషాలు ఆ పాలను మరగనివ్వాలి. ఆ తర్వాత పాలను దింపి చల్లారపెట్టాలి. అనంతరం ఆ పాలను గ్లాసుల్లో పోసుకొని.. పైన సన్నగా కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు, కిస్మిస్ మొక్కలు వేసి కొద్దిసేపు అలా ఫ్రిజ్లో పెట్టాలి. ఒక అర్థగంట లేద గంట తర్వాత బయటకు తీస్తే చల్ల చల్లని బాదంపాలు సిద్ధంగా ఉంటాయి. అల వాటిని ఆస్వాదించుకుంటూ తాగొచ్చు. ఇలా పాలను రోజు పిల్లలకు తాగిస్తే ఎండాకాలం ఆరోగ్యంగా ఉంటారు. బయట తాగే బాదం పాలకంటే.. ఇంట్లో తయారు చేసుకునే బాదంపాలు ఆరోగ్యానికి శ్రేయస్కరమైనవి.
బాదం పాలలో ఫైబర్ ఉంటుంది. జీడిపప్పులో కావాల్సినన్ని ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొవ్వులు తగ్గిస్తాయి. బరువులు తగ్గించడంలో సహకరిస్తాయి. బాదంపప్పులను రోజు ఉదయం లేవగానే తింటే మెదడు పనితీరు బాగుంటుంది. బాదం లోని క్యాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. పిల్లలు ఏకాగ్రతను పెంచుతుంది. బాదంపాలు రుచికరంగా ఉండటంతో పిల్లలు కూడా ఇష్టంగా తాగుతుంటారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: You can make cold almond milk at home in summer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com