Health Tips : అందంగా కనిపించాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. అయితే.. ఆ అందంగా కనిపించడం కోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాల్లో ఇంట్లో చేసే హోం రెమిడీస్ కూడా చాలా ఉంటాయి. హోం రెమిడీస్ లో.. ఎక్కువ మంది ఫాలో అయ్యే చిట్కాల్లో టమాట, శనగపిండి వంటివి ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా ముఖానికి శనగపిండి అప్లై చేస్తుంటారు అమ్మాయిలు. అమ్మమ్మల నాటి నుంచి ఈ చిట్కా వాడుతున్నారు కదా. కానీ శనగపిండిని ముఖానికి రాయకూడదు అంటున్నారు నిపుణులు. ఇదేంటి కొత్తగా చెబుతున్నారు అనుకుంటున్నారా?. మీరు చదివింది నిజమే. డైరెక్ట్ గా శెనగపిండిని ముఖానికి అప్లై చేస్తుంటారు చాలా మంది. దానిలో ఏదో ఒకటి మిక్స్ చేసి మరీ రాసే వారు కూడా ఉంటారు. అయితే ఈ ఆర్టికల్ లో శనగపిండిని మొహానికి వాడవచ్చా? లేదా అనే వివరాలు చూసేద్దాం.
శనగపిండిలో రోజ్ వాటర్, పాలు, పసుపు వంటివి కలిపి రాస్తుంటారు కొందరు. అప్పుడు.. ఫలితం చాలా పాజిటివ్ గా వస్తుంది కదా. కానీ.. ఈ శెనగపిండిలో మాత్రం.. కొన్ని కలిపి.. అస్సలు ఫేస్ కి రాయకూడదు అంటున్నారు నిపుణులు. శెనగపిండిలో.. అస్సలు మిక్స్ చేయకూడనివి ఏంటి అంటే?
ఎక్కువ మంది కామన్ గా చేసే తప్పులో ముఖ్యంగా ముఖానికి ముల్తాన మట్టి రాస్తారు.దాంతో పాటు శెనగపిండి కూడా రాస్తారు. అయితే.. ఈ రెండూ కలిపి మాత్రం ముఖానికి వాడవద్దు. ఈ రెండూ కలిపి రాస్తే.. ఫేస్ లో గ్లో పెరుగుతుంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఇలా చేస్తే మీరు పెద్ద పొరపాటు చేసినట్టే.. అందం పెరగడం కాదు… స్కిన్ డ్రైగా మారుతుంది. ఇరిటేషన్ రావడానికి కారణం ఈ మిశ్రమం అంటున్నారు నిపుణులు.
శెనగపిండిని ముఖానికి అప్లై చేయాలనుకుంటే.. దాంట్లో పొరపాటున కూడా.. బేకింగ్ సోడా కలపకండి. ఈ రెండూ కలిపి ముఖానికి రాస్తే.. స్కిన్ డ్యామేజ్ అవుతుంది. తెలియక ఎప్పుడైనా పొరపాటున రాసినా సరే ముఖంపై ర్యాషెస్ వస్తుంటాయి. లేదంటే మొటిమలు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.
శెనగపిండిలో.. పొరపాటున కూడా నిమ్మకాయ రసం కలిపకండి. ఫేస్ క్లీన్ చేయడానికి ఎక్కువ మందికి ఈ రెమిడీని ఉపయోగిస్తారు. కానీ పొరపాటన కూడా ఇలా చేయవద్దు. ఎందుకంటే..స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. అంతేకాదు చర్మంపై దురద వస్తుంది. చర్మం మరింత డ్రైగా మారుతుంది. అందుకే పొరపాటున కూడా ఇలా చేయవద్దు.
ఆల్కహాల్ ఉండే ఎలాంటి ప్రొడక్ట్స్ కూడా.. శెనగపిండిలో మిక్స్ చేయవద్దు. కలపినా.. అది ముఖానికి రాయవద్దు. ఆల్కహాల్ కలిపిన ప్రొడక్ట్స్ వాడితే.. చర్మంపై ఉన్న సహజ నూనెలు తగ్గిపోతాయి అంటున్నారు నిపుణులు. దాని వల్ల చర్మం పొడిగా అవుతుంది. ఇక అన్ని వద్దంటే శెనగపిండిలో ఏం కలిపి ముఖానికి రాసుకోవాలి అనుకుంటున్నారా? అందాన్ని పెంచుకోవాలి అంటే… పసుపు, రోజ్ వాటర్, పెరుగు, అలోవెరా జెల్ వంటివి ఉపయోగించవచ్చు. దీని వల్ల చాలా రకాల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More