
WPL 2023 Mumbai Vs Delhi: డబ్ల్యూ పీఎల్ ప్రీమియర్ లీగ్ లో ముంబై హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లను గెలిచిన ఆ జట్టు, గురువారం ఢిల్లీ జట్టుపై జరిగిన మ్యాచ్ లోనూ విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టింది. డబ్ల్యూ పీఎల్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇప్పటివరకు ఓటమిని రుచి చూడలేదు.. పైగా ఆ జట్టులోని క్రీడాకారులు రాణిస్తున్న నేపథ్యంలో ఎదురే లేకుండా పోయింది. అలాంటి జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడితే మ్యాచ్ మరో విధంగా ఉంటుందని క్రీడాభిమానులు అనుకున్నారు. కానీ వారు అనుకున్నది వేరు, జరిగింది వేరు. హోరాహోరీగా సాగుతుంది అనుకున్న మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగడంతో ముంబై జట్టు గెలిచింది.
టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు ముందు భారీ టార్గెట్ ఉంచాలని అనుకుంది. కానీ ముంబై బౌలర్ల ముందు ఢిల్లీ పప్పులు ఉడకలేదు. ఢిల్లీ జట్టులో మెగ్ లానింగ్(43), జెమీమా రోడ్రిగేజ్ (25), రాధా యాదవ్ (10) మినహా మిగతా బ్యాటర్లు ఎవరు కనీసం రెండు అంకెల స్కోర్ కూడా చేయలేదంటే ముంబై బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. షేఫాలీ అవుట్ అయిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న అలైస్ క్యాప్సి (6), మారిజానే కాప్(2) దారుణంగా విఫలమయ్యారు. జెమీమా జాగ్రత్తగా ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అనే అవుట్ అయిన తర్వాత వచ్చిన జెస్ జోనాసెస్ (2), తానియా భాటియా(4), మిన్ను మణి(0), టారా నోరీస్(0), శిఖా పాండే(4 నాట్ అవుట్) ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో జుట్టు 18 ఓవర్లు మాత్రమే ఆడి 105 పరుగులకు ఆలౌట్ అయింది.

స్వల్ప లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన ముంబై జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. వరుసగా విఫలమవుతున్న ముంబై ఓపెనర్ భాటియా(41) పరుగులు చేసింది.. మిగతా బ్యాటర్లు హెలీ మ్యాథ్యూస్ (32), నాట్ సీవర్ బ్రంట్(23 నాట్ అవుట్), హర్మన్ ప్రీత్ కౌర్ (11 నాట్ అవుట్) అందరూ రాణించారు. ఇంత ముంబై ఇండియన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. ఈ విజయంతో వరుసగా మూడు మ్యాచ్లు ఉన్నాయి ముంబై జట్టు పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ముంబై జట్టు లీగ్ దశలో మరొక మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది.