Name Astrology: మన జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. దీంతో సంసారంలో మనల్ని మనవారిని బాగా అర్థం చేసుకుని చక్కగా సంసారం చేసుకునే ఆడది కావాలని అందరు కోరుకుంటారు. కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని కూడా ఆశపడుతుంటారు. కానీ అందరు ఒకలా ఉండరు. కొందరు గయ్యాళి గంగమ్మలు ఉంటే మరికొందరు రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అర్థం చేసుకునే అర్థాంగి రాకపోతే జీవితమంతా నరకమే. మన గురించి తెలుసుకున్న భార్య ఉంటే జీవితం స్వర్గమే. ఇటీవల అంతటి మహత్తర గుణాలున్న వారు దొరకడం లేదు. నోరు విప్పితే బూతు పురాణమే. మనిషి జన్మ ఎందుకు ఎత్తానురా దేవుడా అనుకునే వారు లేకపోలేదు. జీవిత భాగస్వామితో నేర్పుగా ప్రవర్తిస్తూ మంచి భార్యగా పేరుతెచ్చుకునే వారు కూడా ఉన్నారు.

జ్యోతిష్యం ప్రకారం కొన్ని పేర్లున్న వారు ప్రత్యేక గుణాలున్న వారుగా చెబుతుంటారు. ఆ అక్షరంతో పేరు మొదలయ్యే వారు భర్తలను తమ ఇలవేల్పులుగా అత్తమామలకు సేవలు చేయడంలో ఎంతో ఖ్యాతి గడిస్తారని చెబుతుంటారు. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు తమ భర్తను పూర్తిగా అర్థం చేసుకుని అతడికి అనుగుణంగా నడుచుకుంటారట. ఇంకా వారు అదృష్టవంతులు కావడం వల్ల వారు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుందట. భర్తను సంతోషపెట్టడంతో పాటు అత్తమామలను కూడా బాగా చూసుకుంటుందట. దీంతో ఆమె ఓర్పుగా సంసారం చేస్తుందని విశ్వసిస్తారు.
మరో అక్షరం డి అనే పదంతో పేరు మొదలయ్యే వారు కూడా చాలా అదృష్టవంతులు. వీరిని పెళ్లి చేసుకున్నా భర్త అడుగుజాడల్లో నడుస్తారు. జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. అతడి అవసరాలను గుర్తించి వాటికి అనుకూలంగా నడుచుకుంటుంది. భర్తసమస్యలను అర్థం చేసుకుని వాటిని తీర్చేందుకు సాయపడుతుంది. ఇంకా అతడి బాధల్లో పాలు పంచుకుంటుంది. సంతోషంలో సగం భాగం అవుతుంది. అలా తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా నిలుస్తుంది. అందుకే డి అక్షరం పేరు గల వారిని పెళ్లి చేసుకోవడం ఉత్తమం.

జి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు కూడా భర్తలను బాగా చూసుకుంటారు. ఈ అక్షరం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకుంటే జీవితం ఆనందమే. వీరు ప్రతిభావంతులు కావడంతో జీవిత భాగస్వామిని అన్ని విషయాల్లో అర్థం చేసుకుంటుంది. కుటుంబ సభ్యులను కూడా ప్రేమిస్తుంది. కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంది. నెంబర్ వన్ భార్యగా, కోడలుగా ద్విపాత్రాభినయం చేస్తుంది. కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచి భర్తకు ఎలాంటి బాధలు రాకుండా చూసుకుంటుంది. జి అనే అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిని చేసుకునేందుకు అబ్బాయిలు వెనకాడాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎలాంటి లోటు ఉండదు.