RRR Japan Collections: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన భారీ మల్టిస్టార్రర్ చిత్రం #RRR ఇటీవలే జపాన్ లో ఘనంగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి జపాన్ లో అద్భుతమైన క్రేజ్ ఉండడం తో ఈ సినిమా ప్రొమోషన్స్ లో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నారు..ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో పాటుగా రాజమౌళి కూడా జపాన్ ప్రొమోషన్స్ లో పాల్గొని అక్కడి మీడియా తో బాగా ఇంటరాక్ట్ అయ్యారు.

ఎన్నో ఇంటర్వూస్ కూడా ఇచ్చారు..థియేటర్స్ కి వెళ్లి ఆడియన్స్ మధ్య కూర్చొని ఎంజాయ్ చేసారు..ఇంతలా ప్రమోట్ చేసారు కాబట్టే దానికి తగ్గ ఫలితం కూడా వచ్చింది ఈ సినిమాకి..ఇప్పటి వరుకు ఈ చిత్రం విడుదలై 17 రోజులు కావొస్తుంది..ఈ 17 రోజులకు గాను రోజుకో రికార్డుని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోయింది #RRR చిత్రం..మొత్తం మీద ఇక్కడ ఇప్పటి వరుకు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి విశ్లేషిద్దాం.
ఈ సినిమాని జపాన్ లో ఇప్పటి వరుకు ఒక లక్ష 22 వేల మంది వీక్షించారట..ఇది ఒక ఆల్ టైం ఫాస్టెస్ట్ రికార్డు గా చెప్పుకోవచ్చు..ఇది వరుకు అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన ఆ సినిమాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ముత్తు సినిమా ఉంది..ఈ చిత్రానికి అక్కడ దాదాపుగా 400 మిలియన్ డాలర్లు వసూళ్లు వచ్చాయి..ఈ సినిమా తర్వాత బాహుబలి చిత్రానికి ౩౦౦ మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి..ఈ రెండు సినిమాలకు దగ్గర్లో కూడా ఇప్పటి వరుకు ఒక్క సినిమా కూడా రాలేదు..కానీ #RRR ఊపు చూస్తుంటే ఎన్నో సంవత్సరాల నుండి చెక్కు చెదరకుండా పదిలంగా ఉన్నా ముత్తు రికార్డు ని బద్దలు కొట్టేస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

ఇప్పటి వరుకు #RRR చిత్రం జపాన్ లో 189 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టినట్టు సమాచారం..వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రానికి స్టడీ కలెక్షన్స్ వస్తున్నాయట..ఇక వీకెండ్స్ లో అయితే మొదటి రోజు ఎంత వసూళ్లు ఉన్నాయో..అదే రేంజ్ వసూళ్లు వీకెండ్స్ లో రాబడుతుందట..ఇదే ట్రెండ్ మరో రెండు వారాలు కొనసాగిస్తే ముత్తు రికార్డు అవుట్ అంటున్నారు ట్రేడ్ పండితులు.