Wife And Husband: భార్యకు ఈ విషయాలు అస్సలు చెప్పకూడదు..

దంపతులు మధ్య బేధాభిప్రాయాలు రావడానికి పెద్ద కారణాలేవీ లేవని అంటున్నారు. భార్యభర్తలు మధ్య ఉన్న కమ్యూనికేషన్ లోపమే ప్రధాన కారణమని చెబుతున్నారు.

Written By: Chai Muchhata, Updated On : February 26, 2024 11:42 am

Wife And Husband

Follow us on

Wife And Husband: భార్యభర్తల బంధం పవిత్రమైనదిగా భావిస్తాం. రెండు హృదయాలు ఒక్కచోటుకు చేరి జీవితాంతం కలిసి ఉంటాయి. ఈ క్రమంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ఒకరి తప్పులను ఒకరు మన్నించుకుంటూ.. ఒకరిని మరొకరు గౌరవించుకుండడం వల్ల జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. అయితే కొందరు ఇలా పెళ్లి చేసుకొని అలా విడిపోతున్నారు. చిన్న చిన్న తప్పులకే విడాకుల పేపర్లపై సైన్ చేస్తున్నారు. కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఈ మధ్య విడిపోతున్న దంపతులు మధ్య బేధాభిప్రాయాలు రావడానికి పెద్ద కారణాలేవీ లేవని అంటున్నారు. భార్యభర్తలు మధ్య ఉన్న కమ్యూనికేషన్ లోపమే ప్రధాన కారణమని చెబుతున్నారు. అయితే కొన్ని విషయాల్లో భార్యభర్తలు గోప్యత పాటించాలంటున్నారు. అప్పుడు మనస్పర్థలు రాకుండా ఉంటాయని అంటున్నారు. ఇంతకీ ఆవేంటంటే?

ప్రతీ భార్య తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో భర్త ఏం చేసినా భరిస్తుంది. కానీ తన కుటుంబ సభ్యుల గురించి చెప్పినప్పుడు మాత్రం పెద్దగా పట్టించుకోదు. ముఖ్యంగా భర్త తన తల్లిదండ్రులను పొగుడుతూ భార్యను కించపర్చడం అస్సలు సహించదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల గురించి లేదా బంధువుల గొప్పతనాల గురించి భార్య ముందు చెప్పకూడదు. ఇలాంటి విషయాలను అవైడ్ చేయడం ఎంతో బెటర్.

తప్పుచేయని వ్యక్తి అంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఒకరి తప్పును మరొకరు మన్నించుకోవడం ద్వారా జీవితం సాఫీగా సాగుతుంది. కానీ అందరికీ అలాంటి పరిస్థితి ఉండదు. అందువల్ల పాత తప్పులకు బయటకు లాగకపోవడమే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో పెళ్లికి ముందు ఎలాంటి తప్పులు చేసినా వాటిని భార్యతో చెప్పకూడదు. అలాగే అంతకుముందు ఉన్న గర్ల్ ఫ్రెండ్ గురించి భార్య వద్ద ప్రస్తావించకూడదు. ఇలా చేయడం ఏ వివాహిత ఒప్పుకోదు.

ప్రతి మొగాడనికి కొన్ని బలహీనతలు ఉంటాయి. వీటిని కొందరు వివాహితలు ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే చాలా వరకు బలహీనతల గురించి బయటపెట్టకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే కొన్ని విషయాల్లో భార్యపై కోప్పడినప్పుడు బలహీనతల ఆధారంగా హేళన చేసే అవకాశం ఉంది. దీంతో మానసికంగా కుంగిపోయి మరింత ఆందోళన చెందుతారు. దీంతో భార్యపై మరింత అసహ్యం పుట్టుకొచ్చి విడిపోయే వరకు దారి తీస్తుంది.

ఆరోగ్యం సమస్యల గురించి భార్యకు చెప్పకుండా ఉండాలి. ఇలా చెప్పడం వల్ల తన భర్త ఫిట్ కాదనే భావనలో ఉంటారు. అయితే తప్పనిసరి అయితే మాత్రం సమస్య గురించి వివరించి అర్థం చేసే ప్రయత్నం చేయాలి. ఆ సమస్య పరిస్కారం కోసం సహకారం అడగాలి. అప్పుడు నిజాయితీగా సమస్యలపై సానుకూలంగా ఉంటారు. భార్యభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం మాత్రమే. ఇది కోల్పోయినప్పుడు ఇద్దరి మధ్య చిన్న తప్పు పెద్దదిగానే కనిపిస్తుంది. అందువల్ల ఒకరిపై ఒకరు నమ్మకంగా కలిగి ఉండాలి.