https://oktelugu.com/

Allu Arjun Arrest : అల్లు అర్జున్ ని బలమైన ఆధారాలతో ఇరికించిన పోలీసులు..రెగ్యులర్ బెయిల్ రావడం అసాధ్యమేనా?

జనవరి 12 వ తేదీతో ఈ బెయిల్ గడువు ముగుస్తుంది. అయితే ఈ కేసు విషయంలో పోలీసులు కాసేపటి క్రితమే మరో సంచలనమైన ఆధారం బయటపెట్టారు. అల్లు అర్జున్ కి ప్రీమియర్ షో జరగబోయే ముందు రోజే పోలీసులు ఆయన వచ్చేందుకు అనుమతిని నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. దానికి సంబంధించిన ఫోటోని నేడు తెలంగాణ పోలీస్ శాఖ మీడియా కి విడుదల చేసింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 16, 2024 / 11:39 PM IST
    Follow us on

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసు రోజురోజుకి బలపడుతుంది. సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ కారణంగా తొక్కిసిలాట జరిగి రేవతి అనే యువతీ చనిపోయింది. ఈ కారణంగా అల్లు అర్జున్ పై FIR రిజిస్టర్ అవ్వడం తో మొన్ననే ఆయన్ని అరెస్ట్ చేసారు. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆయనకు అరెస్ట్ అయిన రోజే ఇంటెర్మ్ బెయిల్ లభించింది. జనవరి 12 వ తేదీతో ఈ బెయిల్ గడువు ముగుస్తుంది. అయితే ఈ కేసు విషయంలో పోలీసులు కాసేపటి క్రితమే మరో సంచలనమైన ఆధారం బయటపెట్టారు. అల్లు అర్జున్ కి ప్రీమియర్ షో జరగబోయే ముందు రోజే పోలీసులు ఆయన వచ్చేందుకు అనుమతిని నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. దానికి సంబంధించిన ఫోటోని నేడు తెలంగాణ పోలీస్ శాఖ మీడియా కి విడుదల చేసింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది.

    అయితే దీనిపై సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆధారం ఉన్నప్పుడు ఎందుకు మొన్ననే కోర్టు లో సబ్మిట్ చేయలేదు..?, అంటే ఇది నిజమైన ఆధారమేనా?, లేకపోతే అల్లు అర్జున్ ని ఇరికించేందుకు పుట్టించిన ఆధారమా అని ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ ని జైలుకి పంపేవరకు తెలంగాణ ప్రభుత్వం నిద్రపోయేట్టు లేదని, ఒక్కడి మీద ఇంత కక్ష్య గట్టడం సరికాదని సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ తొక్కిసిలాట లో చనిపోయిన రేవతి కుమారుడు శ్రీ తేజ్ కిమ్స్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు. అతని పరిస్థితి నిన్న చాలా తీవ్రమైన విషమ పరిస్థితిలో ఉంది. అందరూ ఈ పిల్లాడు చావు బ్రతుకుల నుండి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

    ఇప్పటికే అల్లు అర్జున్ ఆ కుటుంబానికి పాతిక లక్షల ఆర్ధిక సాయం అందించాడు. అంతే కాకుండా ఆ బిడ్డలిద్దరి బాధ్యతలు తానే తీసుకుంటానని ఒక వీడియో ని విడుదల చేసి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ‘ముందు ఆ అబ్బాయిని కలిసి రండి’ అంటూ కామెంట్స్ వినిపించాయి . కానీ ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నందున ఆ అబ్బాయిని కలిసేందుకు మాకు అనుమతి లేదని, ఒక్కసారి ఈ అన్ని సర్దుకున్నాక ఆ అబ్బాయిని కలుస్తానని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్ . ప్రస్తుతం అతను కిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నెమ్మదిగా మెరుగు పడుతున్నట్టు తెలుస్తుంది. ఒకపక్క తెలుగు సినిమా ఇండస్ట్రీ వసూళ్ల పరంగా గర్వించదగ్గ ‘పుష్ప 2’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న అల్లు అర్జున్, ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహాన్ని పూర్తిగా ఎంజాయ్ చేసే అవకాశం కూడా లేకపోవడం శోచనీయం.