Truck : భారతదేశంలోని రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు, మీరు కవిత్వం, నినాదాలు, కొటేషన్స్ తో అలంకరించిన రంగురంగుల ట్రక్కులను చూసి ఉంటారు. ఇవన్ని కామన్ గానే చూస్తుంటారు. ఎవరికి నచ్చిన కవితలు వారు రాసుకుంటారు. హీరో, హీరోయిన్ పోస్టర్లు కూడా వేసుకుంటారు. అంతే కాదు ప్లీజ్ మెయింటెన్ డిస్టెన్స్, దూరం పాటించండి అంటూ కూడా రాసి ఉంటుంది. అంతేకాదు ఒక వాక్యాన్ని కూడా చూసి ఉంటారు. అదేంటంటే? ‘హార్న్ ఓకే ప్లీజ్’. ఈ నినాదం భారతీయ ట్రక్కులలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. చాలా కాలంగా ప్రజలకు ఉత్సుకత కలిగించే అంశంగా ఉంది. ఇది ఎంత ప్రజాదరణ పొందిందంటే, అది ఒక బాలీవుడ్ సినిమాకి కూడా ప్రేరణనిచ్చింది అంటే అర్థం చేసుకోండి. కానీ ఈ నినాదం నిజమైన అర్థం ఏమిటో? అది ఎక్కడ నుంచి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : 400 చక్రాలు.. ఏడాది నుంచి ప్రయాణం.. ఇండియాలోనే అతిపెద్ద ట్రక్కు కథ
‘హార్న్ ఓకే ప్లీజ్’ అని ఎందుకు రాస్తారు?
ట్రక్కుల వెనుక ‘హార్న్ ఓకే ప్లీజ్’ అని రాయడం సర్వసాధారణం. అంటే మీరు ట్రక్కును ఓవర్‌టేక్ చేయాలనుకుంటే, హారన్ కొట్టండి అని.. అంటే హారన్ కొట్టి మీరు ఓవర్ టేక్ చేయాలనే విషయం డ్రైవర్‌కు తెలియజేయండి అన్నమాట. ట్రక్కు పెద్ద వాహనం కాబట్టి ఇది చాలా ముఖ్యం. ట్రక్కు డ్రైవర్ ప్రతిదానిపైనా శ్రద్ధ చూపడం కష్టం. ఈ విధంగా, ఈ సిగ్నల్ వెనుక ఉన్న వాహనాలకు ట్రక్కు ఓవర్‌టేక్ చేయబోతోందని తెలియజేస్తుంది. ప్రమాదాల అవకాశాలను తగ్గిస్తుంది.
అయితే, ఒకప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య వాహనాలపై ‘హార్న్ ఓకే ప్లీజ్’ అని రాయడాన్ని నిషేధించింది. ఈ పదబంధం ఇతర వాహనాలు హారన్ మోగించడాన్ని ప్రోత్సహిస్తుందని, తద్వారా శబ్ద కాలుష్యం పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఆసక్తికరమైన చరిత్ర
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇంధన కొరత కారణంగా, ట్రక్కులు కిరోసిన్‌ను ఉపయోగించాయి. కిరోసిన్ మండే స్వభావం కలిగి ఉండటం వల్ల, ఇతర డ్రైవర్లను హెచ్చరించడానికి ట్రక్కులపై ‘ఆన్ కిరోసిన్’ అని రాశారు. కాలక్రమేణా, ఇది ‘ఓకే’ గా సంక్షిప్తీకరించారు. తరువాత ‘హార్న్ ఓకే ప్లీజ్’ గా పరిణామం చెందింది. భాష కాలక్రమేణా ఎలా మారుతుందో? కొత్త అర్థాలను ఎలా తీసుకుంటుందో చెప్పడానికి ఇది ఒక ఆసక్తికరమైన ఉదాహరణ. అయితే, ఈ రోజుల్లో డీజిల్ సులభంగా అందుబాటులోకి రావడం, రోడ్లు విశాలంగా మారడంతో ఈ నినాదానికి ప్రజాదరణ తగ్గింది.
Also Read : ఓ ట్రక్ డ్రైవర్ యూట్యూబర్ అయ్యాడు.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడంటే..