Elon Musk Twitter: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ సేవ 2006 లో ఇంటర్నెట్లో ప్రారంభించబడింది ప్రారంభించినప్పటి నుండి టెక్-సావీ వినియోగదారులలో, ముఖ్యంగా యువతలో బాగా ప్రాచుర్యం పొందింది. మైస్పేస్ ఫేస్ బుక్ వంటి అనేక సోషల్ నెట్వర్క్లలో ట్విట్టర్ బాగా ప్రాచుర్యం పొందింది.

ఎంతో మంది సెలబ్రెటీలకు, రాజకీయనాయకులకు, సంస్థలకు సందేశాలు ఇవ్వడానికి ఇది చక్కటి ఫ్లాట్ ఫామ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలో ట్విట్టర్ లో ఎక్కువగా అనుసరించే వ్యక్తి. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ రెండవ స్థానంలో, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ మూడవ స్థానంలో ఉన్నారు. ట్విట్టర్ సామాన్య ప్రజల గొంతుకను ట్రెండింగ్ పేరుతో వెలుగులోకి తెస్తోంది.
మాస్క్ బంపర్ ఆఫర్..
అయితే ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారీ డీల్ ఆఫర్ చేశాడు. ట్విట్టర్ ను కొనబోతున్నట్లు మస్క్ ప్రకటించారు. ప్రపంచ సోషల్ మీడియా ప్లాట్ ఫారామ్ లో ట్విట్టర్ 15వ స్థానంలో ఉంది. స్పెస్ ఎక్స్, టెస్లా సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్ ప్రపంచంలో కుబేరుల జాబితాలో మొదటిస్థానంలో ఉన్నారు. ట్విట్టర్ కంపెనీకి చెందిన ఒక్కో షేర్ ను 54.20 డాలర్ల చొప్పున 43 బిలియన్ డాలర్లు వెచ్చింది కొనేందుకు మస్క్ ముందుకు వచ్చారు. ఎప్రిల్ 1తో ముగిసిన ట్రేడింగ్ లో ట్విట్టర్ షేర్ విలువకన్నా ఇది 38 శాతం అధికం. ఇటీవలే మస్క్ ట్విట్టర్ లో కొన్ని షేర్లు కొని వాటాదారుడిగా మారాడు. ఈ ప్రకటనతో ట్విట్టర్ షేర్ల విలువ బుధవారం 12 శాతం పెరిగాయి. ప్రస్తుతం మస్క్ ప్రతిపాదించన డీల్ బెస్ట్ డీల్ గా ఆయన పేర్కొన్నాడు.
అయితే రేసెంట్ గా మాస్క్ ట్విట్టర్ లో 9.2 % వాటాను కొనుగోలు చేశారు. గతంలో ట్విట్టర్ సామర్థ్యంపై, వాక్ స్వాతంత్రం పై మాస్క్ అనేక ప్రశ్నలను సంధించారు. దీంతోపాటు కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రూపొందించె ఆలోచనలో ఉన్నట్లు ట్వీట్ చేశారు. ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కలిగి ఉన్నట్లు యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ & ఎక్స్చేంజ్ కమిషన్లో దాఖలు చేసిన ఫైలింగ్ లో మాస్క్ ఈ సంగతి చెప్పారు. ట్విట్టర్లో వాటాలను మాస్క్ కొనుగోలు చేసిన వార్త బయటకు రాగానే ట్రేడింగ్ లో ఆ సంస్థ స్క్రిప్ట్ 26 శాతానికి పైగా దూసుకెళ్లి 49 డాలర్ల వద్ద నిలిచింది.
Also Read: ఆటతోనే సమాధానం చెప్తున్న పాండ్యా.. దానికోసమే విజృంభిస్తున్నాడా
ట్రేడింగ్ ముగిసే సమయానికి ట్విట్టర్ షేర్ 39.31 డాలర్లుగా ఉంది. ట్విట్టర్ లో మాస్క్ వాటా 2.89 బిలియన్ డాలర్లు. దీంతో ఈ మైక్రో బ్లాగింగ్ సంస్థలోని అతిపెద్ద వాటాదారునిగా మాస్క్ నిలిచారు. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ కంటే మాస్ కు నాలుగు రెట్లు వాటాలు ఉన్నాయి. జాక్ డోర్సీ కేవలం 2.25 శాతం వాటాలు మాత్రమే కలిగి ఉన్నారు. ట్విట్టర్ పాలసీలపై నిత్యం విమర్శలు గుప్పించే వారు మాస్క్. కానీ సుదీర్ఘకాలం ట్విట్టర్ మనుగడ సాగించడానికి ఆ సంస్థ పాలసీలే కీలకంగా మారాయి.
అయితే మాస్క్ డబ్బుకోసం కొనుగోలు చేయడంలేదని చెప్తున్నారు. ఫ్యూచర్ లో అందరికి ఆమోదయోగ్యమైన ఓ ప్రజావేదిక అవసరమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్చగా మాట్లాడుకునేందుకు అనువైన ఫ్లాట్ ఫామ్ గా ట్విట్టర్ అవతరిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. అయితే మాస్క ఆఫర్ తమకు అందిందని వాటాదార్ల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని ట్విట్టర్ ప్రకటించింది. అయితే ట్విట్టర్ తనప్రతిపాదనకు అంగీకరిస్తుందో లేదో తనకు తెలియదని కానీ.. ఇందులో విఫలం అయితే తనకు ప్లాన్ బీ ఉందని స్పష్టం చేశారు. అయితే అదేంటో వివరించలేదు.
Also Read: ఆత్మకూరు లో మేకపాటి తమ్ముడే అభ్యర్థయినా? పోటీ అనివార్యమేనా?
[…] Also Read: ట్విట్టర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ ఎంద… […]