Why Indians eat with hands: ప్రపంచంలోకెల్లా భారతదేశంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. వీటిని భారతీయులు పురాతన కాలం నుంచి పాటిస్తూ వస్తున్నారు. వీటిలో కొన్నింటికి నిబంధనలు ఏర్పాటు చేశారు. పెద్దలు ప్రతి నిబంధన, పద్ధతులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేశారు. వాటిని ఒకరి తర్వాత ఒకరు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. వీటిలో చేతితో అన్నం తినడం ఒకటి. వాస్తవానికి ఒకప్పుడు అన్నం తినడానికి ఇతర పరికరాలు ఏమీ లేవు. దీంతో ఏ ఆహారం అయినా చేతితో మాత్రమే తినేవారు. అలా ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండగలిగారు. కానీ ప్రస్తుతం చాలామంది స్పూన్, పోర్క్ వంటివి ఉపయోగిస్తున్నారు. వీటి కంటే చేతితో తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవి ఎలా అంటే?
రకరకాల పనుల వల్ల చేతులకు మట్టి అంటుతుంది. అయితే కొందరు సరిగా శుభ్రం చేసుకోలేరు. అలా చేతుల్లో క్రిములు దాగి ఉండడం వల్ల.. స్పూన్ తో ఆహారం తినాలని కొందరు చెబుతారు. అయితే ఇది తాత్కాలికంగా పరిశుభ్రమే అనుకున్న.. ఆరోగ్యపరంగా మాత్రం చాలా నష్టాలు జరుగుతాయి. చేతితో తినకపోవడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను దూరం చేసుకుంటాం.
ప్రతి ఒక్కరి చేతికి ఐదు వేళ్ళు ఉంటాయి. ఈ ఐదు వేళ్ళు పంచభూతాలకు ప్రతికలుగా భావిస్తారు. ఇవి శరీరంలోని జీర్ణ క్రియను పెంపొందించడానికి ఉపయోగపడతాయి. చేతికి ఉండే వేళ్ళ చివరిలో ఉండే నరాలు జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి. దీంతో తిన్న ఆహారం సరైన క్రమంలో జీర్ణం అవుతుందని గుర్తించారు. అందుకే భారతీయులు చేతితో ఆహారాన్ని తింటారు. అంతేకాకుండా ఆహారం ఉష్ణోగ్రత, దాని స్వభావాన్ని ముందే గుర్తిస్తుంది. అయితే ఈ ఆహారాన్ని చేతితో తీసుకోవడం వల్ల మరింత ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. దీనిపై ఎంతోమంది పరిశోధకులు పరిశోధనలు చేశారు. చేతితో తినడం వల్ల కేవలం సాంప్రదాయం మాత్రమే కాదని.. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వర్జినియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు.
అయితే నేటి తల్లిదండ్రులు చెబుతున్న ప్రకారం.. చేతిలో ఎన్నో రకాల క్రీములు ఉంటాయని.. చిన్నపిల్లలు సరిగ్గా శుభ్రం చేసుకోలేరని.. అందుకే స్పూన్ వాడుతున్నామని అంటున్నారు. వాస్తవానికి స్పూన్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవని.. అంతేకాకుండా దీంతో తినడం వల్ల ఎంత తింటున్నామో తెలియదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చేతితో ఆహారాన్ని తగిన మోతాదులో మాత్రమే తీసుకుంటామని.. ఇతర పరికరాలతో తింటే.. క్రమ పద్ధతిలో ఉండదని చెబుతున్నారు. చిన్నపిల్లలకు సైతం చేతితో ఆహారం తిని అలవాటు చేయాలని అంటున్నారు.
కింద కూర్చొని చేతితో తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సాంప్రదాయాలను కూడా కాపాడిన వారవుతారని మరికొందరు చెబుతున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. ఈ ఆహారాన్ని దైవ స్వరూపంగా భావించి ఇతర పరికరాలతో కాకుండా చేతితో తినడం వల్ల గౌరవం ఇచ్చిన వారవుతారని అంటున్నారు. అందువల్ల చేతితోనే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.