Phone : ఫోన్ ఇప్పుడు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఫోన్ మీద ఆధారపడటం కామన్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే, మీరు ఎవరితో మాట్లాడినా, మీ నోటి నుంచి వచ్చే మొదటి పదం (మొదటి టెలిఫోన్ గ్రీటింగ్) ‘హలో’. కాల్ చేసిన వ్యక్తి మాత్రమే కాదు, ఫోన్ అందుకున్న వ్యక్తి కూడా ముందుగా ‘హలో’ అని చెబుతాడు. కానీ ఇలా ఎందుకు ఫోన్ లిప్ట్ చేయగానే హలో అంటామో మీకు ఎవరికి అయినా తెలుసా? ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? భలే కదండీ. అవును ఇంతకీ మనం ఎందుకు హలో అంటాము? ఈ “హలో” అనే పదాన్ని మాత్రమే సంభాషణను ప్రారంభించడానికి ఎందుకు ఉపయోగిస్తారు? అంటే? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం.
Also Read : ఐఫోన్ 16 ప్రో మాక్స్ బ్యాటరీ.. పాడైతే కొత్త ఫోన్ కొనేంత ఖర్చు చేయాల్సిందే !
గ్రాహం బెల్ స్నేహితురాలు ‘హలో’
టెలిఫోన్ ఆవిష్కర్త అలెగ్జాండర్ గ్రాహం బెల్ స్నేహితురాలి పేరు ‘మార్గరెట్ హలో’ అనే కథను మీరు కూడా విని ఉండవచ్చు. ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు, అతను తన స్నేహితురాలి పేరును పలికాడట. అప్పటి నుంచి కూడా అతను ఎప్పుడు ఫోన్ చేసినా సరే ముందు ఏది మాట్లాడకుండా ఆమె పేరును పిలిచేవాడంట. అంటే హలో అని. ఇక అదే కంటిన్యూ అవుతూ మన వరకు కూడా హలో అని వచ్చింది. మీరు కూడా హలోనే అంటారా? లేదా ఆ.. చెప్పు, ఏంటి? ఎందుకు పోన్ చేశావ్ అంటూ చిరాకు పడతారా?
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? ఈ కథకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. నిజానికి, గ్రాహం బెల్ స్నేహితురాలి పేరు మాబెల్ హోవార్డ్, తరువాత అతను ఆమెను వివాహం చేసుకున్నాడు కూడా.
‘అహోయ్’ అనే పదాన్ని ఉపయోగించడం
హలో అనే పదం 19వ శతాబ్దంలో ఉద్భవించింది. దీనికి ముందు, ఫోన్‌లో మాట్లాడటానికి అహోయ్ అనే పదాన్ని ఉపయోగించారు. హలో కాదు, అహోయ్ అని మొదట చెప్పింది గ్రాహం బెల్. “హలో” అనడానికి ముందు, ఫోన్‌లో మాట్లాడటానికి ప్రజలు “అహోయ్” లేదా “మీరు వింటున్నారా?” వంటి విభిన్న పదాలను ఉపయోగించారు. (నా మాట వినబడుతుందా?). ఇక ఇది తెలిసిన తర్వాత ఆ స్నేహితురాలి కథ అబద్ధమని తేలింది.
ఎడిసన్ ‘హలో’ ని ప్రారంభించాడు.
ఇప్పుడు గ్రాహం బెల్ స్నేహితురాలి కథ నిజం కాకపోతే, ఫోన్‌లో మొదట హలో ఎందుకు అంటారు అనే ప్రశ్న మళ్లీ వచ్చిందా మీకు? లైట్ బల్బును కనుగొన్న థామస్ ఎడిసన్ 1877లో టెలిఫోన్ సంభాషణను ప్రారంభించడానికి “హలో” అనే పదాన్ని ఉపయోగించమని సూచించాడు. ఎడిసన్ ఆ పదం స్పష్టంగా, వినడానికి సులభంగా ఉంటుందని నమ్మాడు. క్రమంగా అది ప్రజాదరణ పొందింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఫోన్‌లో సంభాషణను ప్రారంభించడానికి “హలో” ఉపయోగించడానికి కారణం అయింది అన్నమాట.
మనం ఫోన్ ఎత్తిన వెంటనే మొదట హలో అని ఎందుకు అంటామో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంట. అలాగే, మనం ఎవరినైనా ముఖాముఖిగా కలిసినప్పుడు పలకరించడానికి కూడా హలో అనే పదాన్ని ఉపయోగిస్తాము కదా. ఏదైతే ఏంటి మాట్లాడుకోవడానికి అంటే సంభాషణ స్టార్ట్ చేయడానికి ఓ మంచి పదం ఉంది కద చాలు. దీనివల్ల నష్టం ఏం లేదు కదా.
Also Read : జనాభాను మించిపోయిన మొబైల్ ఫోన్లు.. ఏంటీ విప్లవం