Holi Festival Importance: మన పండుగల విశిష్టత గురించి తెలిస్తే ఆశ్చర్యం వేస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం మన పండుగలకు ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మన పండుగల్లో ఉన్న వైవిధ్యం ఎక్కడా కనిపించదు. మనిషిలోని ఆచార వ్యవహారాలకు పండుగలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే కాలానుగుణంగా పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ. పంటలు చేతికి వచ్చే సమయంలో సంక్రాంతి, పూలు పూసే సమయంలో దసరా, ఆరు రుచుల సమ్మేళనంతో నిర్వహించే ఉగాది లాంటి పండుగలను మనం జరుపుకుంటాం. వాటిలో ఉండే ప్రాముఖ్యతను ఆస్వాదిస్తూ ఆనందంగా జరుపుకుంటాం.

నేడు జరుపుకునే పండుగ హోలీ గురించి కూడా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ధర్మబద్ధంగా జీవించే క్రమంలో జీవిత పరమార్థం గుర్తించి నడుచుకోవాలి. ఇందుకు మనిషిలో ఉండే గుణాలను ఆసరాగా చేసుకుని ముందుకు సాగాలి. హిందూ సంప్రదాయం ప్రకారం మన ఆచార వ్యవహారాలతో పండుగలకు కూడా సంబంధం ముడిపడి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని పూర్ణిమ రోజు నిర్వహించే కామదహనంకు కూడా ప్రత్యేక కథ ప్రచారంలో ఉండటం తెలిసిందే.
Also Read: Corona 4th Wave In India: ముంచుకొస్తున్న కరోనా ఫోర్త్ వేవ్.. కేంద్రం హైఅలెర్ట్
ధర్మసింధు, నిర్ణయ సింధు గ్రంథాల ఆధారంగా కామదహనం గురించి ఆసక్తికర కథలు ప్రచారంలో ఉన్నాయి. పౌర్ణమి రోజు కాముడి దహనం చేస్తున్నందున కాముని పున్నం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇంకా కూడా పలు కథలు ఉన్న సంగతి తెలిసిందే. అసలు కామ దహనం ఎందుకు చేస్తారంటే పార్వతి శివుడిని పెళ్లి చేసుకునేందుకు అతడి తపస్సును భంగం చేయాలని కామ దేవుడిని అడుగుతుంది. దీంతో శివుడి ఏకాగ్రతను దెబ్బతీయాలని కోరుతుంది. దీంతో శివుడు మూడో నేత్రంతో కాముడిని దహనం చేస్తాడు. అప్పుడు కాముడి సతీమణి రతీదేవి శివుడిని ప్రాధేయపడగా బతికిస్తాడు. మనిషిలోని కోరికలను దహించేందుకే కామ దహనం చేస్తారని ప్రతీతి.

రంగులు చల్లుకోవడానికి కూడా ఓ కథ ఉంది. హిరణ్యకశపుడి చెల్లెలు అయిన హోలిక రాక్షసి చనిపోవడానికి గుర్తుగా ఇవాళ రంగులు చల్లుకుంటారని చెబుతారు. హోలిక మహోత్సవాన్ని ఆనాటి నుంచి హోలిక రాక్షసి నుంచి విముక్తి పొందిన సందర్భంగా ఈ వేడుక నిర్వహించుకుంటారని తెలుస్తోంది. ఏడాదికోమారు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుని ఆనంగా గడపడం కూడా ఇందులో ఓ భాగమే. దేశవ్యాప్తంగా రంగులు చల్లుకోవడం చూస్తుంటాం.
పరమేశ్వరుడు కాముడిని దహనం చేయడంలో అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉండటం తెలిసిందే. మనిషిలో దాగి ఉన్న చెడును దూరం చేసి మంచిని తీసుకోవడానికి ఉద్దేశించిందే అని చెబుతారు. రాగ, ద్వేష. కామ, క్రోధ, మోహ, మాయ తదితర చెడులను త్యజింపజేసి మనసును అదుపులో పెట్టుకునేందుకు కామదహనం ఉదాహరణగా చెప్పడం చూస్తున్నాం.

హోలీ పండుగ విశిష్టత గురించి తెలుసుకుంటుంటే ఇంకా ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. కామదహనం అనేది ప్రధానంగా సాగే పంగుగలో రంగులు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలో అందరు తారతమ్య భేదాలు లేకుండా సామరస్య భావంతో చల్లుకోవడం తెలిసిందే. దీంతో అందరు సమానమనే భావం కూడా తెలుస్తోంది.
Also Read: TRS Party Dissent: టీఆర్ఎస్ లో అసంతృప్తి మంటలు.. అంటుకోవడం ఖాయమా?
[…] […]