Ramcharan Trivikram: ఎట్టకేలకు వారిద్దరి కాంబినేషన్ ఖాయం అయ్యింది !

Ramcharan Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ లైనప్‌ మామూలుగా లేదంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం భీమ్లానాయక్‌ కు కర్త, కర్మ, క్రియగా ఆయనే ఉండగా, బ్లాక్‌ బస్టర్‌ కి ఏమాత్రం తీసిపోకుండా భీమ్లాను మలిచారట. ఇక తదుపరి మహేష్‌తో ఓ భారీ చిత్రాన్ని తీయనుండగా, ఆ తర్వాత ఎన్‌టీఆర్‌తో ఓ ప్యాన్‌ ఇండియా మూవీని ప్లాన్‌ చేశారట. ఇక ఆ తర్వాత చరణ్‌తో ఉంటుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి చరణ్‌, త్రివిక్రమ్ […]

Written By: Raghava Rao Gara, Updated On : March 27, 2022 11:04 am
Follow us on

Ramcharan Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ లైనప్‌ మామూలుగా లేదంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం భీమ్లానాయక్‌ కు కర్త, కర్మ, క్రియగా ఆయనే ఉండగా, బ్లాక్‌ బస్టర్‌ కి ఏమాత్రం తీసిపోకుండా భీమ్లాను మలిచారట. ఇక తదుపరి మహేష్‌తో ఓ భారీ చిత్రాన్ని తీయనుండగా, ఆ తర్వాత ఎన్‌టీఆర్‌తో ఓ ప్యాన్‌ ఇండియా మూవీని ప్లాన్‌ చేశారట. ఇక ఆ తర్వాత చరణ్‌తో ఉంటుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల క్లారిటీ ఇచ్చేశారు.

Ramcharan Trivikram

మొత్తానికి చరణ్‌, త్రివిక్రమ్ కాంబినేషన్‌ ఫిక్స్‌ అయ్యింది. నిజానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వస్తోందంటూ గత కొన్ని నెలలుగా ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతూనే ఉంది. నిజానికి చరణ్ ఎప్పటినుండో చరణ్ తో సినిమా చేయాలని చాలా ప్లాన్ చేస్తూ వచ్చాడు. కానీ త్రివిక్రమ్ కి మహేష్ తో, ఆ తరువాత ఎన్టీఆర్ తో సినిమాలు ఫిక్స్ అయిపోవడంతో ఇక చేసేదేం లేక మిగిలిన పెద్ద దర్శకులను వెతికే పనిలో పడి శంకర్ ను ఫైనల్ చేసుకున్నాడు.

కాగా తాజాగా శంకర్ సినిమా తరువాత సినిమాని త్రివిక్రమ్ తో చేస్తాడట చరణ్. ఎంతైనా టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పని చేయాలని, చిన్న హీరో నుండి పెద్ద హీరోలు వరకూ కలలు కంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్క త్రివిక్రమ్ మాత్రమే.. సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ ను అలాగే వారి టైమింగ్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి.. హీరోలను అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సినిమాలు చేస్తాడు. త్రివిక్రమ్ తో సినిమా చెయ్యడం ప్రతి హీరో కెరీర్ కి బాగా ప్లస్ అవుతుంది.

Ram Charan

పైగా అటు కమర్షియల్ గానూ త్రివిక్రమ్ సినిమాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి, రెవిన్యూ పరంగానూ యూఎస్ లాంటి చోట్ల కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు రాజమౌళి తరువాత హీరోలు వెంట పడుతున్న ఏకైక దర్శకుడు త్రివిక్రమే కావడం విశేషం. చరణ్ కూడా త్రివిక్రమ్ తో తన సినిమా ప్లాన్ చేసింది అందుకే. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది త్రివిక్రమ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం ఉంది. మరి ఈ కాంబినేషన్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి.

Tags