Washing Machine: బట్టలు ఉతకాలంటే ఒకప్పుడు చేతులతోనే చేసేవారు. కానీ ఇప్పుడు చాలా ఇండ్లలో వాషింగ్ మిషిన్ వచ్చేసింది. దాంతో చాలామంది వీటిల్లో బట్టలు వేసేసి ఉతికేసుకుంటున్నారు. అయితే ఇలా మిషిన్‌లో వేసేటప్పుడు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దాని వల్ల బట్టలు చిరిగిపోతుంటాయి అయితే కొన్ని టిప్స్ పాటిస్తే సురక్షితంగా బట్టలు ఉతుక్కోవచ్చు.

చాలా బట్టల మీద ఉండే లేబుల్స్ మీద వాటిని ఎలా ఉతకాలో ఉంటుంది. ఆ ప్రకారంగానే వాటిని వాష్ చేసుకోవాలి. ప్యాంట్ లను ఉతికేటప్పుడు చాలామంది వాటిని అలాగే వాషింగ్ మిషిన్ లో వేసేస్తుంటారు. దాని వల్ల ఇతర బట్టలు ఆ జిప్‌లకు చిక్కుకుని చిరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్యాంట్ జిప్పులను పైకి లాగి, ప్యాంట్‌లను పైకి ఉండే విధంగా మిషిన్ లో వేయాలి.
Also Read: Pawan Kalyan vs YCP: పవన్ ‘ప్రకటన’ను తప్పు దారి పటిస్తున్న వైసీపీ
బట్టలు వేసేటప్పుడు బట్టలను లోపల వైపు బయటకు వచ్చే విధంగా తిప్పి వేయాలి. దాంతో అవి ఈజీగా మెషిన్‌లో తిరుతాయి. దాంతో మరకలు త్వరగా పోతాయి. ఇక వాషింగ్ మిషిన్ లో డిటర్జెంట్ పౌడర్‌ను తగిన మోతాదులోనే వేసుకోవాలి. తక్కువగా వేస్తే మరకలు పోవు, ఎక్కువ వేస్తే బట్టలకు అతుక్కుని పోతుంది. కాబట్టి ఎక్కువ, తక్కువ కాకుండా తగిన మోతాదులోనే వేయాలి.
మరకలు అంటిన దుస్తులను ఎప్పుడైనా విడిగానే ఉతకాలి. లేదంటే వాటికి ఉన్న మరకలు ఇతర దుస్తులకు అంటుకునే అవకాశం ఉటుంది. వాషింగ్ మిషిన్ మీద ఉన్న కొన్ని సెట్టింగ్ లను చూసుకుని వాడుకోవాలి. ఎలాంటి దుస్తులకు ఎలాటి సెట్టింగ్స్ వాడాలో అక్కడ చాలా క్లుప్తంగా ఉంటుంది. దాన్ని ఫాలో అయితే బట్టలు ఉతకడం చాలా ఈజీ.

ఇక వాష్ చేసిన బట్టలను సహజ పద్ధతుల్లోనే ఆరేసుకోవాలి. దాని ద్వారా బట్టలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. కాబట్టి ఈ సులువైన పద్ధతుల ద్వారా బట్టలు ఉతుక్కుంటే ఎప్పటికైనా జాగ్రత్తగా ఉంటాయి. మరిన్ని జాగ్రత్తలు వాషింగ్ మిషిన్ ద్వారా వచ్చే రిసిప్ట్ లో ఉంటాయి.
Also Read: Kapu Reservation: ఏపీని ‘కాపు’ కాస్తానంటున్న బీజేపీ.. కేంద్రం ప్రకటనతో ఇరుక్కున వైసీపీ!

[…] […]