Homeలైఫ్ స్టైల్Old men marry young women : వృద్ధులు యువ మహిళలను ఎందుకు పెళ్లి చేసుకుంటారు?...

Old men marry young women : వృద్ధులు యువ మహిళలను ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అసలేంటి కారణం?

Old men marry young women : నేటి కాలంలో చాలా మంది వయసు పైబడిన వారు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. అయితే వీరు వారి వయసుతో సమానమైన వారిని కాకుండా తక్కువ వయసు ఉన్న వారిని కోరుకుంటున్నారు. వారితోనే ప్రేమగా ఉంటున్నారు. కొందరు మహిళలు సైతం వయసు ఎక్కువగా ఉన్న వారిని ఇష్టపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కొందరు దంపతుల మధ్య సాధారణంగా పదేళ్ల వయసు తేడా ఉంటుంది. కానీ 20 నుంచి 30 ఏళ్ల తేడా వయసు ఉన్న వారు ఒక్కటవుతున్నారు. జీవితాంతం కలిసి ఉండేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ వయసు ఉన్న వారు తమకు ఎక్కువ వయసు చిన్న వారితో కలిసి ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే?

సాధారణంగా ఆడ, మగ జీవితాంతం కలిసి ఉండడానికి వివాహం చేసుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో లివింగ్ రిలేషన్ షిప్ పేరుతో పెళ్లి కాకుండానే కలిసి జీవిస్తున్నారు. ఇలా కలిసి ఉండేవారి మధ్య తక్కువ వయసు కంటే భారీ తేడా వయసు ఉన్నవారు కూడా ఉన్నారు. వయసు పైబడిన కొద్దీ వారిలో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వారికి ఆప్యాయతను కలిగించే ఓ తోడు కావాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఒంటనిగా ఉండే పురుషులు ఆడవారి నుంచే ప్రేమను పొందాలను చూస్తారు. ఇలంటి వారికి తక్కువ వయసు ఉన్న వారు తమపై శ్రద్ధ చూపుతారని భావిస్తారు. అందుకే ఎక్కువ వయసు ఉన్న వారు తమకంటే తక్కువ వయసు ఉన్న వారిని కోరుకుంటారు.

వయసు పెరిగిన కొద్దీ స్నేహితులు దూరమవుతాయి. ఒకవేళ ఉన్నా.. వారిని కలుసుకునేందుకు శారీరక శక్తి సహకరించదు. దీంతో వీరు ఎవరినీ కలవలేకపోతారు. ఇలాంటి సమయంలో వారు మానసికంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో వీరికి ఓ తోడు ఉండాలని భావిస్తారు. ఆ తోడు మహిళ అయితే సంతోషంగా ఉంటామని భావిస్తారు. అయితే తనతో సమానంగా ఉన్న వారు పెళ్లి చేసుకునే ఆస్కారం ఉండదు. అందువల్ల తక్కువ వయసు ఉన్న వారు పెళ్లికి సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా కొన్ని పరిస్థితుల కారణంగా వీరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ కారణంగా వయసు తేడాతో ఉన్న వారు ఒక్కటవుతారు.

వయసు ఎక్కువ ఉన్న వారు కటుంబ సభ్యులతో ఆప్యాయంగా ఉండలేరు. ఎవరి పనుల కారణంగా వారు బిజీగా ఉంటారు. ఈ క్రమంలో వీరిని పట్టించుకోవడానికి శ్రద్ధ చూపరు. దీంతో వీరి కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉండాలని కోరుకుంటారు. అయితే తక్కువ వయసు ఉన్న వారు తమ పరిస్థితిని అర్థం చేసుకుంటారని అనుకుంటారు. ఈ కారణంగా భారీ వయసు తేడాతో ఉన్నవారు పెళ్లి చేసుకుంటారు. శారీరకంగానూ ఎమోషనల్ ఫీలవుతారు. వయసు పై బడిన వారు తమ వయసుతో వారి కంటే తక్కువ వయసుతో ఉండడం వల్ల ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. వీరితో కలయిక వల్ల ఎక్కువ సంతృప్తిని కోరుకుంటారు. ఇక ఓపెన్ కమ్యూనికేషన్ కావాలని కోరుకునేవారు, స్వేచ్ఛగా ఉండాలనుకునేవారు ఇలాంటి వారిని కోరుకుంటారని తెలుస్తోంది.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular