https://oktelugu.com/

Celebrities: సెలబ్రెటీలే ఎందుకు ఎక్కువ విడాకులు తీసుకుంటున్నారు? అసలు కారణం ఏంటి?

క్యూట్ కపుల్ అనుకన్న సమంత నాగచైతన్య, ధనుష్ ఐశ్వర్య రజినీకాంత్, ఈషా డియోల్ భారత్ తడాని ఇలా చాలా మంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేక జంటలు విడిపోయారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 6, 2024 / 03:53 PM IST

    Why are celebrities getting more divorces

    Follow us on

    Celebrities: పెళ్లంటే నూరేళ్ల పంట. ఎన్నో ప్రమాణాలతో ఒకటైన జంటలు జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటారు. కానీ చిన్న చిన్న కారణాల వల్ల ఈ మధ్య ఎన్నో జంటలు విడిపోతున్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే ఈ విషయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా జంటలు విడిపోయాయి. అందులో ముఖ్యంగా క్యూట్ కపుల్ అనుకన్న సమంత నాగచైతన్య, ధనుష్ ఐశ్వర్య రజినీకాంత్, ఈషా డియోల్ భారత్ తడాని ఇలా చాలా మంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేక జంటలు విడిపోయారు. ఇంతకీ సెలబ్రెటీలే కాదు సామాన్య జనాలు కూడా ఇలా విడిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారా? అయితే ఓ సారి లుక్ వేయండి..

    1..ఆర్థిక స్వేచ్ఛ.. ఆర్థిక స్వేచ్ఛ ఎక్కువగా ఉండటంతో ఒకరికి మరొకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండటం లేదు. కొందరు నటనా రంగంలో, మరికొందరు వ్యాపార రంగంలో ఎలా ఉన్న సరే చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి వారికి సంబంధించిన చాలా విషయాలు వారు పరిష్కరించుకో గలుగుతున్నారు. అందుకే బాండింగ్ స్ట్రాంగ్ అవడం లేదు. కష్టసుఖాలు పంచుకుంటున్నప్పుడు కలిసిమెలిసి ఉన్నప్పుడే ఆ రిలేషన్ స్ట్రాంగ్ ఉంటుంది.

    2..నిర్ణయాలు తీసుకోగలిగే ధైర్యం.. ఆర్థిక స్వేచ్ఛ వల్ల నిర్ణయాలు కూడా ఈజీగా తీసుకోగలరు. ఏదైనా సమస్య వస్తే మేము చేసుకోగలం, ఎంతటి కష్టాన్ని అయినా భరించగలం అనే నమ్మకం ఉండటంతో ఎదుటి వ్యక్తితో అవసరం లేదు అనిపిస్తుంటుంది. కొన్ని సార్లు వ్యక్తి మీద ఎంత ఇష్టం ఉన్నా సరే కలిసి బతికి గొడవ పడేకంటే విడిపోయి సంతోషంగా ఉండటం బెటర్ అనుకుంటున్నారు.

    3..అక్రమ సంబంధాలు.. దేన్ని భరించినా కూడా భాగస్వామి ఈ అక్రమ సంబంధాన్ని భరించడం కష్టమే. ఇంట్లో గొడవలు ఉన్నా సర్దుకు పోతారు కానీ.. తమ అనుకున్న వారు మరొకరితో ఉంటున్నారు అని తెలిస్తే మాత్రం తట్టుకోలేరు. ఇలాంటప్పుడు వారితో కలిసి బతికే కంటే విడిపోవడం ఉత్తమం అనుకుంటున్నారు.

    4.. తల్లిదండ్రుల మద్దతు.. సామాన్య కుటుంబాల్లో తల్లిదండ్రుల మద్దతు విడాకుల విషయంలో తక్కువగానే ఉంటుంది. చుట్టు పక్కల వారు ఏం అనుకుంటారో? ఎంత ఖర్చు పెట్టి చేసిన పెళ్లి సో వృధా అవుతుంది అని ఆలోచిస్తారు. నచ్చజెప్పి ఇద్దరిని కలపాలి అని ఆలోచిస్తారు. కానీ సెలబ్రెటీల విషయంలో మాత్రం కొన్ని సార్లు ఇలా జరగకపోవచ్చు. వారి పిల్లలు వారి కాళ్ల మీద నిల్చోవడం, వారికి సంబంధించిన విషయాలు వారే చూసుకోవడం వంటివి చేస్తుంటారు కాబట్టి తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంటుంది.

    5..ఈగో.. ఈగో ఉంటే భార్యాభర్తల సంబంధం మాత్రమే కాదు. ఏ రిలేషన్ అయినా సరే విడిపోతుంది. తమకు తప్ప ఇతరులకు తెలియదు అనుకోవడం, చాలా చులకన చేసి మాట్లాడటం, నలుగురి ముందు అవమానించడం వంటివి చేస్తుంటే వారితో కలిసి ఉండటం కష్టమే. ఇక ఈ రీజన్ లు మాత్రమే కాదు. మరెన్నో విషయాల వల్ల కూడా విడిపోతుంటారు. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా అర్థం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండటమే బెటర్.