Smoking in the Morning: ‘ధూమపానం ఆరోగ్యానికి హానికం’ అని ఎక్కడ చూసినా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి పొగ పీల్చడానికి అలవాటు అయిన వారు మానడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. పొగ తాగొద్దని, వీటి నివారణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా.. ధూమపాన ప్రియుల సంఖ్య తగ్గడం లేదు.దీంతో చాలా మంది పొగను పీలుస్తూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. సిగరెట్ల నుంచి నికోటిన్ తాత్కతాలికంగా ఉపశమనం లభించినా దీర్ఘకాలికంగా మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురవుతారని చాలా మందికి తెలుసు. అయినా మానసిక సమస్యల నుంచి తట్టుకోవడానికి పొగపీలుస్తున్నామని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే కొందరు ఉదయం లేవగానే సిగరెట్ తో రోజును ప్రారంభిస్తారు. ఉదయాన్నే పొగతాగడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయంటే?
ధూమపానం తాగడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని పొగ పీల్చేవారి మాట. కానీ ముందుగా ఇలా మొదలైన అలవాటు ఆ తరువాత వ్యసనంగా మారుతుంది. రాను రాను ఇది దినచర్యగా మారుతుంది. కొందరు రోజుకు కనీసం పది నుంచి ఎక్కువగా సిరెట్లు తాగనిదే రోజును గడపరు. ప్రతి చిన్న విషయానికి మదనపడిపోతూ సిగరెట్లు పీలుస్తూ ఉంటారు. ముఖ్యంగా సాప్ట్ వేర్ రంగానికి చెందిన వారు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సిగరెట్లను ఎక్కువగా తాగుతుంటారని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
అయితే కొందరు ఉదయం లేవగానే పొగ తాగిన తరువాతే రోజును ప్రారంభిస్తారు. ఉదయం లేచిన 30 నిమిషాల లోపు పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని అన్నారు. సాధారణ సమయాల్లో సిగరెట్లు తాగేవారికంటే వీరిలో నోరు, ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటుందని అంటున్నారు. అంతేకాకుండా ఇలాంటి వారికి క్యాన్సర్ ముందుగానే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు పరిశోధకులు వెల్లడించారు. అందువల్ల ఉదయం వ్యాయామం లాంటివి మాత్రమే చేయాలని, పొగ తాగడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.