Sunrisers Captain: ఐపీఎల్ సమరానికి సమయం దగ్గర పడుతోంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఐపీఎల్ కోలాహలం ప్రారంభం కానుంది. దీంతో ఆటగాళ్ల వేలానికి ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. గత సంవత్సరం తీసుకున్న ఆటగాళ్లను రిటైన్ చేస్తూ కొత్త వారిని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. గతేడాది హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాళ్ల వేలంలో భారీగానే పొదుపు చేసింది. సీనియర్ ఆటగాళ్లను దూరం చేసి కొందరిని తక్కువ ధరకే తీసుకుని డబ్బు ఆదా చేసుకుంది. కానీ ఫలితాలు మాత్రం అందుకోలేకపోయింది. పోరాట పటిమ చూపించలేక చతికిలపడింది.

2019లో కెప్టెన్ గా చేసిన కేన్ విలియమ్సన్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది. విండీస్ స్టార్ నికోలస్ పూరమ్ ను వదిలేసింది. అబ్దుల్ సమద్ వంటి ఆటగాళ్లపై వేటు వేసింది. మొత్తం 12 మందిని సన్ రైజర్స్ రిలీజ్ చేసింది. సనై రైజర్స్ ఖరీదైన ఆటగాళ్లను మెగా వేలంలో కొనుగోలు చేసినా ఫలితం శూన్యమే. కేన్ విలియమన్స్ ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది. పూరన్ ధర రూ.10.75 కోట్లు. వీరిద్దరిని వదిలించుకుని రూ.25 కోట్లు ఆదా చేసుకుంది. మిగతా ఆటగాళ్ల ద్వారా మరో రూ.20 కోట్లు లాభం సాధించుకుంది. ఈసారి రూ.42.25 కోట్లతో వేలానికి వెళ్లనుందని తెలుస్తోంది.
డేవిడ్ వార్నర్ ను కెప్టెన్ గా తీసుకున్నా ఫలితాలు రాకపోవడంతో అతడిని మార్చి కేన్స్ విలియమన్స్ ను తీసుకుంది. అతడు కూడా జట్టు పరిస్థితిని మార్చలేదు. దీంతో ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ ను తీసుకోవాలని యోచిస్తోంది. దీనిపై ప్రముఖ కామెంటర్, మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. సన్ రైజర్స్ తరువాతి కెప్టెన్ భువీ అని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. దీంతో సన్ రైజర్స్ ఏ నిర్ణయం తీసుకుంటుంద తెలియడం లేదు.

ఇటీవల టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో ఆటగాళ్ల తీరుపై విమర్శలు వచ్చాయి. ఈక్రమంలో ఆటగాళ్ల వేలంలో ఎవరిని ఎవరు తీసుకుంటారో కూడా తెలియడం లేదు. మొత్తానికి ఫ్రాంచైజీలు మాత్రం తమకు అనుకూలంగా ఉండే ఆటగాళ్లను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఫ్రాంచైజీలు పెరగడంతో పోటీ కూడా పెరుగుతోంది. జట్ట్టుకు విజయం అందించాలంటే సమర్థులైన ఆటగాళ్లు కావాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వేలం ప్రారంభమైతే తెలుస్తుంది ఎవరిని ఎవరు కొనుగోలు చేస్తారనే విషయం.