Mahesh Babu Krishna : సూపర్ స్టార్ కృష్ణ గారి మరణ వార్త యావత్తు సినీ లోకాన్ని, లక్షలాది మంది అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది..ఇక ఘట్టమనేని కుటుంబానికి ఎంత బాధ ఉంది ఉంటుందో మాటల్లో చెప్పలేము..ఒకే ఏడాది కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు, కృష్ణ గారి సతీమణి ఇందిరా దేవి గారు..ఇక కృష్ణ గారు ఇలా వరుస మరణాలను చూసి మానసికంగా ఎంతో కృంగిపోయిన ఆ కుటుంబం ఇప్పట్లో కోలుకునేలా లేదు.

ఒకే ఏడాది లో అన్నయ్య , తల్లి మరియు తండ్రిని పోగొట్టుకున్న మహేష్ బాబు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు..ఇలాంటి మానసిక క్షోభ అనుభవిస్తున్న ఈ సమయం లో కొంతకాలం సినిమాలకు దూరం గా ఉండాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది..కొద్దికాలం క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాని ప్రారంభించి ఒక షెడ్యూల్ ని పూర్తి చేసిన మహేష్ బాబు తల్లి మరణం తో రెండు నెలల పాటు షూటింగ్ బ్రేక్ ఇచ్చాడు.
తల్లి మరణ వార్త ని జీర్ణించుకొని తిరిగి మళ్ళీ షూటింగ్ ప్రారంభిద్దాం అనుకునే లోపే తండ్రి కృష్ణ గారు కూడా మృతి చెందడం తో మహేష్ బాబు చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యాడు..ఒక సినిమా ఫ్లాప్ అయితేనే రెండు మూడు నెలలు అజ్ఞాతంలోకి వెళ్లి ఒంటరిగా గడిపే మహేష్ బాబు కి, జీవితం లో ఆరాధ్య దైవం లాంటి తండ్రి కృష్ణ గారి మరణాన్ని తట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది..అందుకే ఈ నెలలో ప్రారంభం కావాల్సిన త్రివిక్రమ్ మూవీ షెడ్యూల్ ని క్యాన్సిల్ చెయ్యమని చెప్పినట్టు సమాచారం..అంతకుముందు ఈ సినిమా స్టోరీ నచ్చలేదని..మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని కూడా మార్చాలని..కొత్త కథతో సినిమా చేద్దామని మహేష్ త్రివిక్రమ్ తో చెప్పినట్టుగా రూమర్స్ ప్రచారమయ్యాయి..అయితే అవి కేవలం రూమర్స్ మాత్రమే.
ప్రస్తుతం ఆయన ఎదురుకుంటున్న మానసిక ఒత్తిడిని తట్టుకోలేకనే మహేష్ బాబు తన తల్లి గారు చనిపోయినప్పుడు రెండు నెలలు షూటింగ్ ని వాయిదా వెయ్యమన్నాడని ఆ చిత్ర నిర్మాత నాగ వంశి ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు..ఇప్పుడు కృష్ణ గారు కూడా చనిపోవడం తో ఇక షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో అనేది ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి.