Pitru Devathalu: హిందూ ధర్మం ప్రకారం మనం పితృదేవతలను ఆరాధించాలి. లేకపోతే వారికి కోపం వస్తుందట. ప్రతి సంవత్సరం వారు చనిపోయిన రోజు శ్రధ్ధగా శ్రాద్ధ కర్మలు పాటించాలి. వారికి పిండం, తర్పణం వదలాలి. వారిని గుర్తు చేసుకోవాలి. వారి పేరు మీద అన్నదానం చేయాలి. ఇలా చేయకపోతే మనకు ఇబ్బందులు రావడం సహజం. అందుకే పితృదేవతలను నిర్లక్ష్యం చేస్తే మనం తగిన ఫలితం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పితృదేవతలంటే ఎవరు?
మన కుటుంబానికి చెందిన ఏడు తరాలకు చెందిన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, బంధువులు, గురువులను పితృదేవతలుగా చెబుతారు. వారికి మనం చేసే శ్రాద్ధ కర్మలు, పితృతర్పణాలు పితృదేవతారాధనగా భావిస్తారు. చనిపోయిన వారికి వారు మరణించిన తిథి రోజు కర్మలు చేయడం తప్పనిసరి. లేకపోతే బాధ్రపద మాసంలో చతుర్దశి, మహాలయ అమావాస్య రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం మంచిది.
పితృదేవతల ఫొటోలు ఎక్కడ ఉంచుకోవాలి
మన పూర్వీకుల ఫొటోలు పడక గదిలో ఉంచుకోకూడదు. డ్రాయింగ్ రూంలో కూడా ఉండకూడదు. ఇలా చేయడం వల్ల అనారోగ్యాలు ఏర్పడతాయి. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ పితృదేవతల ఫొటోలు ఉంచుకుంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. శ్రాద్ధ కర్మలు చేయకపో యినా పితృదేవతలను తలుచుకోకపోయినా వారికి కోపం వస్తుంది. ఫలితంగా పితృదోషాలు వస్తాయి.
వారి సంతోషం కోసం ఏం చేయాలి
పితృదేవతల సంతోషం కోసం మూడు కార్యాలు చేయాలి. మరణించిన వారికి ఆత్మశాంతి తర్పణలు వదలాలి. శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు చేయాలి. వారిని తలుచుకుని అన్నదానం, వస్త్రదానం చేయాలి. గోవులకు సేవ చేస్తే మంచిది. పితృదేవతలు శాంతించడానికి వారిని ఆరాధించడంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మనకు ఎన్నో ఇబ్బందులు రావడం ఖాయం.