
IPL : ఐపీఎల్ మొదలైంది అంటే క్రికెట్ అభిమానులకు పండగే పండగ. ఎక్కడ మ్యాచ్ జరిగినా అక్కడ స్టేడియం వీక్షకులతో కిక్కిరిసిపోతుంది. మరి ఈ ఐపీఎల్ మ్యాచ్లు ఏ ఏ స్టేడియాల్లో జరుగుతాయి..? ఏ స్టేడియంలో ఎంత సీటింగ్ కెపాసిటీ ఉందో తెలుసుకుందామా మరి.
ఎంఏ చిదంబరం స్టేడియం.. 33,500 సామర్థ్యం..
ఐపీఎల్ ఎప్పుడు జరిగిన తప్పనిసరిగా మ్యాచులు నిర్వహించే స్టూడియోలో ఎంఏ చిదంబరం స్టేడియం ఒకటి. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఉన్న ఈ స్టేడియం వేలాది మంది అభిమానులు వీక్షించేందుకు అనుగుణంగా వుంటుంది. మొత్తంగా 33,500 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో మ్యాచ్ అంటే ప్రేక్షకులకు కనులు పండగగానే ఉంటుంది.

ఈడెన్ గార్డెన్స్.. 80,000 సామర్ధ్యం..
ఇండియాలోనే అతిపెద్ద స్టేడియాల్లో ఈడెన్ గార్డెన్స్ ఒకటి. ఈ స్టేడియంలో ఆడటానికి క్రికెటర్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ స్టేడియంలో ఒకేసారి 80 వేల మంది కూర్చుని మ్యాచ్ వీక్షించేందుకు అవకాశం ఉంది. అతి పెద్ద స్టేడియం అయినప్పటికీ.. ఇక్కడ మ్యాచ్ జరిగే ప్రతిసారి సీట్లు ఫుల్ అవుతాయి అంటే ఎక్కడ క్రికెట్ అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
వాంఖడే స్టేడియం.. 33,108 సామర్ధ్యం..
ఇక క్రికెట్ కు పుట్టినిల్లు లాంటి ముంబైలో మ్యాచ్ అంటే ఆషామాషీగా ఉండదు. ఇక్కడ జరిగే ఏ మ్యాచ్ అయినా గ్రౌండ్ అభిమానులతో హోరెత్తిపోతుంది. ఐపీఎల్ మ్యాచ్లు ఈ మైదానంలో జరగనున్నాయి. పంకడే స్టేడియం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. సీటింగ్ సామర్థ్యం 33,108.
ఎం ఏ చిన్న స్వామి స్టేడియం.. 40,000 సామర్ధ్యం..
ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లో జరిగే స్టేడియంలో ఎం ఏ చిన్న స్వామి స్టేడియం ఒకటి. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు నగరంలో ఈ స్టేడియం ఉంది. ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 40 వేలు. ఇక్కడ మ్యాచ్ నిర్వహించిన ప్రతిసారి వేలాదిగా అభిమానులు తరలివస్తుంటారు.
అరుణ్ జైట్లీ స్టేడియంలో..
ఈ ఏడాది ఐపీఎల్ లో కీలక మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్న స్టేడియాల్లో ఢిల్లీ ఒకటి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పలు కీలక మ్యాచ్లో జరగనున్నాయి. ఈ స్టేడియంలో 55 వేల సీటింగ్ సామర్థ్యం ఉంది.
నరేంద్ర మోడీ స్టేడియం.. లక్షా పది వేలు సామర్ధ్యం..
ఇండియాలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాల్లో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం ఒకటి. ఈ మధ్య కాలంలోనే నిర్మించిన ఈ స్టేడియంలోనూ ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లో ఎక్కువగా జరగనున్నాయి. లక్ష పదివేల సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్ లు అభిమానుల కోరుతూ హోరుతూ మారుమోగిపోనుంది.
మొహాలీ స్టేడియం.. 27 వేల సామర్థ్యం..
పంజాబ్లోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియం మొహలీలో ఈ ఏడాది పలు ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ స్టేడియం సామర్థ్యం 27,000. ఎక్కడ నిర్వహించే మ్యాచులకు వేట అధిక సంఖ్యలో అభిమానులు వస్తుంటారు. ప్రతిసారి ఇక్కడ గ్రౌండ్ ఫుల్ అవుతుంది.
లఖ్ నవూ స్టేడియం.. 50 వేల సామర్ధ్యం..
ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు జరిగే మరో స్టేడియం ఉత్తరప్రదేశ్లోని లఖ్ నవూలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియం సేటింగ్ సామర్థ్యం 55000 కాగా, ఇక్కడ ఈ ఏడాది పలు మ్యాచ్లు నిర్వహించనున్నారు.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం.. 55 వేల సీటింగ్ సామర్ధ్యం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక మైదానంలో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లో జరుగునున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పలు మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఈ స్టేడియంలో 55000 సీటింగ్ సామర్థ్యం ఉంది.
బర్సా పరా క్రికెట్ స్టేడియం.. 50,000 సామర్థ్యం..
అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరంలో గల బర్షాపర క్రికెట్ స్టేడియంలో ఈ ఏడాది పలు మ్యాచులు నిర్వహించనున్నారు. ఈ స్టేడియంలో 50 వేల సీటింగ్ సామర్థ్యం ఉంది.
సవాయ్ మాన్సింగ్ స్టేడియం.. 30,000 సామర్థ్యం..
ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్న మరో నగరం రాజస్థాన్ రాష్ట్రంలోని జయపుర. ఈ నగరంలోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో పలు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ స్టేడియంలో 30 వేల సీటింగ్ కెపాసిటీ ఉంది.
ధర్మశాల స్టేడియం.. 23000 సామర్థ్యం..
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ధర్మశాల స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ స్టేడియం సామర్థ్యం 23000. ఈ స్టేడియంలోనూ పలు మ్యాచ్లు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు.